ఈ విషయంలో జక్కన్న కన్నా అట్లీ గ్రేట్‌...!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2026-02-12 06:30 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి మహేష్‌ బాబు లుక్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఫ్యాన్స్‌, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి నేపథ్యంలో సహజంగానే ఒకటి రెండు పిక్స్, వీడియోలు వారణాసి సెట్స్ నుంచి బయటకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ విషయంలో రాజమౌళి చాలా సీరియస్ అయ్యారు. గతంలోనూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాహుబలి, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలకు సంబంధించిన చిన్న చిన్న బిట్స్ లేదా పిక్స్ లీక్ కావడం జరిగింది. అందుకే ఇండస్ట్రీలోనే అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ, సీక్రెట్‌ వ్యవస్థను రాజమౌళి ఏర్పాటు చేసుకున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ వారణాసి సినిమా ఆన్‌ సెట్‌ లీక్ ను మాత్రం ఆయన ఆపడంలో పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పక తప్పదు.

ఫస్ట్‌ లుక్ లీక్ కావడంతో...

రాజమౌళి లీక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చిన్న తప్పు జరుగుతూనే ఉంది. ఇక ఇతర హీరోల సినిమాల నుంచి లీక్‌ లు అనేవి చాలా కామన్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది పెద్ద హీరోల సినిమాల ఫస్ట్‌ లుక్‌ లు రివీల్ కాకుండానే లీక్ కావడం, దాంతో అఫిషియల్‌గా రిలీజ్ చేయడం మనం చూశాం. కానీ ఈ మధ్య కాలంలో ఒక సినిమా నుంచి చిన్న పిక్‌ లీక్ కాలేదు, సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా లీక్ కాలేదు, సినిమా షూటింగ్‌ అప్డేట్‌ బయటకు రావడం లేదు, హీరోయిన్స్‌ ఎవరు, వారు ఎలా కనిపించబోతున్నారు అనే విషయంలో కూడా ఎలాంటి లీక్ లేదు. అదే అల్లు అర్జున్‌ - అట్లీ కాంబోలో రూపొందుతున్న మూవీ. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ మొత్తం ముంబైలో జరుగుతున్న విషయం తెల్సిందే. ముంబైలో జరిగిన సినిమాలు సైతం లీక్ సమస్యను ఎదుర్కొన్నాయి, కానీ అట్లీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాడు.

పాన్ ఇండియా మూవీ

అట్లీ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో ఈ సినిమాపై పాన్‌ ఇండియా రేంజ్‌ లో అంచనాలు ఉన్నాయి. ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ అభిమానుల నుంచి అన్ని వర్గాల వారు అంటున్నారు. సినిమా షూటింగ్‌ మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏం జరుగుతుందని యూనిట్‌ సభ్యులు అధికారికంగా చెప్పడం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒక రకంగా లీక్‌ లు రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా పిక్‌, వీడియోలే కాదు కనీసం న్యూస్ కూడా లీక్ కావడం లేదు. దర్శకుడు అట్లీ, సన్‌ పిక్చర్స్ వారు అలా ప్లాన్‌ చేశారు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి వంటి దర్శకుడు లీక్ ను నివారించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ అట్లీ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా ఇంప్లిమెంట్‌ చేస్తూ చిన్న లీక్‌ కూడా లేకుండా చూసుకున్నాడు.

అల్లు అర్జున్‌ - అట్లీ కాంబో మూవీ

లీక్‌ ను అరికట్టడంలో పెద్ద దర్శకులు, నిర్మాణ సంస్థలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అట్లీ పూర్తిగా సక్సెస్‌ అయ్యాయి. మరి కొన్నాళ్లకు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎలాంటి లీక్ లేకుంటే అట్లీ అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. షూటింగ్‌ ముగిసే వరకు లీక్‌ కాకుండా చూసుకుంటే కచ్చితంగా రాజమౌళి కంటే అట్లీ గ్రేట్‌ అని కొందరు అంటున్నారు. ఈ మధ్య కాలంలో కంటెంట్‌ ను ఎంత గొప్పగా తీశాం అన్నది కాకుండా, దాన్ని ఎంత బాగా ప్రమోట్‌ చేశాం, దాన్ని ఎంత మేరకు లీక్ కాకుండా కాపాడుకున్నాం అనేది ముఖ్యం గా మారింది. అందుకే ఈ విషయంలో నిజంగానే రాజమౌళి కంటే అట్లీ గ్రేట్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అట్లీ తన గత చిత్రాల విషయంతో పోల్చితే ఈ సినిమాకు లీక్ నుంచి కాపాడుకోవడం కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. అట్లీ - అల్లు అర్జున్‌ కాంబో మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి అధికారిక అప్‌డేట్‌, ఫస్ట్‌ లుక్‌, గ్లిమ్స్ ఎప్పటికి వస్తాయో చూడాలి. లీక్‌ లేకుండా వచ్చే ఫస్ట్‌ లుక్‌, గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా సినిమా హైప్‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News