సూపర్ హిట్ సీక్వెల్ ఉంది... వెయిట్ చేయండి
2025లో వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, అభిమానం దక్కించుకున్న సినిమాల్లో F1 సినిమా ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
2025లో వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, అభిమానం దక్కించుకున్న సినిమాల్లో F1 సినిమా ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ టాప్ సినిమాల లిస్ట్‌లో F1 సినిమా ప్లేస్ సంపాదించుకుంది. చాలా తక్కువ సమయంలోనే ఏకంగా 500 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు చేసింది. ఇండియాలో కూడా అనుకున్న స్థాయి కంటే దాదాపు డబుల్ వసూళ్లు రాబట్టిందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. వసూళ్లతో పాటు, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా పలు అరుదైన రికార్డ్‌లను, రివార్డ్‌లను సొంతం చేసుకుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్, అవార్డ్ వేడుకలో పాల్గొనడం, ఇంకా సినిమాను అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడం చేస్తున్న మేకర్స్ తాజాగా మరో అవార్డ్ వేడుకలో సందడి చేశారు.
F1 సినిమా సీక్వెల్ విషయంలో...
లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో F1 సినిమా నిర్మాత జెర్రీ బ్రూక్ హైమర్ పాల్గొన్నారు. సినిమా విజయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు, పలు విషయాల పట్ల ఆయన తన సంతృప్తి వ్యక్తం చేశాడు. అంతే కాకుండా తమ సినిమా గురించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాడు. ముఖ్యంగా F1 సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ గత కొన్ని నెలులగా వస్తున్న వార్తల విషయంలో ఆయన స్పందించాల్సిందిగా చాలా మంది కోరడం జరిగింది. ఎట్టకేలకు ఆయన ఆ విషయాన్ని గురించి క్లారిటీ ఇచ్చాడు. సీక్వెల్ విషయంలో నిర్మాత జెర్రీ నుంచి స్వయంగా క్లారిటీ రావడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మాటతో గత కొన్ని రోజులుగా అదుగో, ఇదుగో అంటూ వస్తున్న పుకార్లకు, వార్తలకు అన్నింటికి కూడా నిర్మాత జెర్రీ ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.
జోసెఫ్ కొసిన్స్కీ దర్శకత్వంలో...
F1 సీక్వెల్ విషయమై నిర్మాత జెర్రీ స్పందిస్తూ... మా యూనిట్ సభ్యులు అంతా సీక్వెల్ పై పని చేస్తున్నారు, మేము సీక్వెల్ కోసం సిద్ధం అవుతున్నాం అన్నాడు. అయితే అంతకు మించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేను అన్నాడు. మేకింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయం, అంచనా ఇలా ఏమీ ఇప్పుడు చెప్పలేను అన్నాడు. కచ్చితంగా F1 సీక్వెల్ వస్తుంది, అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. సీక్వెల్ కోసం రేసింగ్ సినిమాలను ఇష్టపడే వారు ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లు సీక్వెల్ ఉందా... లేదా... అనే సందిగ్ధంలో ఉన్న వారికి నిర్మాత స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఒక స్పష్టత వచ్చినట్లు అయింది. ఇక మీదట సినిమా కోసం ఆయా ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. హాలీవుడ్ సినిమాల సీక్వెల్స్ కు ఎక్కువ సమయం తీసుకోరు అనే అభిప్రాయం ఉంది.
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్
మొదటి భాగంకు దర్శకత్వం వహించిన దర్శకుడు జోసెఫ్ కొసిన్స్కీ ని సీక్వెల్ కి కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా బ్రాడ్ పిట్ సీక్వెల్ లో కనిపిస్తాడా అనే విషయం కూడా స్పష్టత లేదు. కేవలం సినిమాకు సీక్వెల్ ఉందని నిర్మాత ప్రకటించాడు. అది ఎలా ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎవరి నుంచి రాబోతుంది అనే విషయాలను ఈ ఏడాది చివరి వరకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే సూపర్ హిట్ F1 సినిమా సీక్వెల్ ను వెండి తెరపై చూడాలి అంటే కనీసం రెండు మూడు ఏళ్లు అయినా ప్రేక్షకులు వెయిట్ చేయాల్సి రావచ్చు అనేది హాలీవుడ్ పరిశీలకుల అభిప్రాయం. అతి త్వరలోనే ఈ సినిమా యూనిట్ సభ్యులు అంతా మరో ప్రతిష్టాత్మక అవార్డ్ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ సమయంలో సీక్వెల్ గురించి మరింత స్పష్టత ఏమైనా వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.