• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు వాట్సప్‌.....

అప్పుడు వాట్సప్‌.. ఇప్పుడు అన్నీ వదిలేసిన పూరి

By - Tupaki Desk
Update: 2022-08-23 05:59 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండేవాడు అందరికీ తెలిసిందే. ట్విట్టర్ లో రెగ్యులర్‌ గా ఏదో ఒక ట్వీట్‌ చేస్తూ తన ఫాలోవర్స్ కి మరియు సినీ జనాలకు అభిమానులకు చేరువగా ఉండేవాడు. ఇక వాట్సప్‌ లో సన్నిహితులతో దగ్గరగా ఉంటూ రెగ్యులర్ గా ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేసుకుంటూ ఉండేవాడట. కానీ ఇప్పుడు పూర్తిగా సోషల్‌ మీడియాకు పూరి జగన్నాథ్ దూరం అయ్యాడని సమాచారం అందుతోంది.

ఇటీవలే వాట్సప్‌ ను తన ఫోన్ నుండి తొలగించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కూడా దూరం అయ్యాడు. వాట్సప్ లో తన స్నేహితులు రెగ్యులర్‌ గా ఏదో ఒక జోక్ లేదా ఏదైనా విషయమై మెసేజ్ లు చేస్తూనే ఉన్నారు. వాట్సప్‌ లో ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉండటం వల్ల పని పై శ్రద్ధ పెట్టలేక పోతున్నాను అంటూ వాట్సప్ ను పూరి డిలీట్‌ చేశాడట.

ఇప్పుడు ట్విట్టర్ కి దూరం అవ్వాలని.. ఇతర సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అందుకు కారణం కూడా పూరి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పలు స్క్రిప్ట్‌ లపై వర్క్ చేయాల్సి ఉందని.. బాలీవుడ్‌ లో కొన్ని సినిమాలు వెంటనే చేయాల్సి ఉంది. అందుకే స్క్రిప్ట్‌ వర్క్ చేయాలనే ఉద్దేశ్యంతో సోషల్‌ మీడియాకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు పూరి పేర్కొన్నాడు.

లైగర్‌ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్‌ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైగర్ హిట్‌ అయితే ఆయన జోరు మామూలుగా ఉండదు. కచ్చితంగా వరుసగా సినిమా లను బాలీవుడ్‌ లో చేసే అవకాశాలు దక్కుతాయి. సల్మాన్ ఖాన్‌ వంటి స్టార్‌ హీరో కూడా మాస్ సినిమాలు చేయాలని పూరి వంటి దర్శకుడికి అవకాశం ఇవ్వొచ్చు. అందుకే పూరి ఈ సినిమాపై చాలా శ్రద్ధ పెట్టారు. లైగర్‌ సినిమా తర్వాత పూరి సౌత్ వాళ్లకు దొరడకం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • PriJagganadh 
  • Whatsapp 
  • Twitter 
  • SocialMedia 
  • Script 
  • Liger 
  • Bollywood 
  • PanIndia 
  • TupakiNews 
  • MovieNews 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS