ఆపండి.. ఆ బికినీ ఈ పిల్లది కాదంటగా!!

Update: 2016-07-05 04:46 GMT
సినిమాల్లేనప్పుడు సడన్‌ గా పాపులార్టీ కావాలంటే ఏం చేయాలి? ఏముంది.. బికినీ వేసుకొని ఒక మ్యాగజైన్ కవర్‌ పేజీ ఫోటోషూట్లో పాల్గొంటే సరి. అయితే ఈ బంగారం మాత్రం.. అసలు ఆ బికినీయే నాది కాదు అంటూ రచ్చ చేస్తూ పాపులార్టీ కొట్టేయాలని చూస్తోంది.

ఆ మధ్య కాలంలో వరుసగా టెంపర్ - కిక్ 2 - బాహుబలి - లోఫర్‌ - ఊపిరి వంటి సినిమాల్లో ఐటెం సాంగుల్లో తెగ మెరిసింది మన మొరాకన్‌ హాటీ నోరా ఫతేహి. అయితే అవన్నీ జనాలు మర్చిపోయారు.. అమ్మడికి బ్రేక్‌ ఇవ్వడం సినిమావాళ్ళు మర్చిపోయారు. దానితో అమ్మడు ఇప్పుడు సడన్‌ గా నా ఫేక్‌ బికినీ పిక్చర్ ఒకటి మీడియా వారు తెగ వాడేస్తున్నారు.. అది నాదు కాదు.. ఎవరో బికినీ వేసుకున్న అమ్మాయికి నా తల అతికించారు అంటూ రచ్చ చేస్తోంది. తన మీద న్యూస్ లేనప్పుడు తానే న్యూస్ క్రియేట్ చేసేసుకుంది నోరా బేబి. ఇదంతా విని ఆమె బికినీ ఫోటోను వేయడం ఆపండి బాసూ.

అయితే మరి ఇప్పటివరకు నోరా ఫతేహి బికినీలో అసలు ఫోటో షూటే చేయలేదా? ఒకవేళ చేసినచో ఇప్పుడు ఈ ఫేక్‌ ఫోటో కోసం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అదే చేయనిచో.. అది కూడా చేసేస్తే పోలా.. ఏమన్నా ఆఫర్లు వస్తాయేమో.. అంటూ జోకులు వేస్తున్నారు బాలీవుడ్‌ మీడియా వారు. వింటున్నావా నోరా?
Tags:    

Similar News