యంగ్ హీరోపై పెరుగుతున్న వ్యతిరేకత.. కారణం?
ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా అనన్య పాండే తో కలిసి నటిస్తున్న చిత్రం ' తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ'.;
ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా అనన్య పాండే తో కలిసి నటిస్తున్న చిత్రం ' తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ'. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ ట్రైలర్ చూశాక చాలామంది ధర్మా ప్రొడక్షన్స్ నుండి వచ్చిన మరో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరికొంతమంది సోషల్ మీడియాలో కార్తీక్ ఆర్యన్ పై , ధర్మ ప్రొడక్షన్స్ పై వ్యతిరేకత చూపించడం సంచలనంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ధర్మా ప్రొడక్షన్ బ్యానర్.. కార్తిక్ ఆర్యన్ ను స్టార్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తోంది అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే కొంతమంది కార్తీక్ ఆర్యన్ తన నటనను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఒకే తరహా డైలాగ్ డెలివరీ, నటనను ఎత్తిచూపుతున్నారు. ఇకపోతే కొంతమంది నెటిజన్స్ కార్తీక్ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది కార్తీక్ ఆర్యన్ తన నటన పరిధిని ఇంకా పూర్తిగా నిరూపించుకోలేదు.. అలాంటి నటుడుని స్టార్ గా ఎలా చిత్రీకరిస్తారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఎన్నో చిత్రాలు గత కొంతకాలంగా పరాభవాన్ని చవిచూస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ధర్మా ప్రొడక్షన్స్ కి బాలీవుడ్లో మంచి పేరు ఉన్నప్పటికీ.. అది వినియోగదారుల విశ్వసనీయత మాత్రమే సరిపోదని.. సగటు కంటెంట్ ను విక్రయించడానికి ధర్మా ప్రొడక్షన్ పి ఆర్ పై ఎక్కువగా ఆధారపడుతోందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలు బాలీవుడ్ ప్రేక్షకులలో పూర్తి నిరాశను కలిగిస్తున్నాయి.
పైగా ఈ నిర్మాణ సంస్థ చాలా మంది సెలబ్రిటీలను రిపీట్ చేస్తోందనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి.. సృజనాత్మకత, నిజాయితీగా కథలు చెప్పడంలో ధర్మా ప్రొడక్షన్స్ ఫెయిల్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కార్తీక ఆర్యన్ తో చేస్తున్న సినిమా సక్సెస్ కావాలని ధర్మా ప్రొడక్షన్స్ పెద్ద ప్రయత్నం చేస్తోంది. మరి ఇలాంటి వ్యతిరేకతల మధ్య ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా ధర్మా ప్రొడక్షన్స్, కార్తిక్ ఆర్యన్ ఇద్దరు కూడా ఈ సినిమాతో విమర్శకులకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.