బ్లాక్ డ్రెస్ లో అందాల జాతర.. మాళవిక సోయగాలు అదరహో!

ఇక చేతులకు గోల్డెన్ కడ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.;

Update: 2026-02-03 10:41 GMT

ఈమధ్య కాలంలో వెరైటీ ఇండియా రూపొందిస్తున్న ఫ్యాషన్ దుస్తులతో హీరోయిన్స్ తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వెరైటీ డ్రెస్ లతో ఫ్యాషన్ ప్రియులకు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ఇందులో బాగానే మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కూడా తాజాగా వెరైటీ ఇండియా డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వెరైటీ డ్రెస్ తో మెస్మరైజ్ చేయగా.. ఇప్పుడు మాళవిక కూడా అలాంటి తరహా డ్రెస్ లోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

 

టాప్ ట్రెండీ ఔట్ ఫిట్ ధరిస్తూనే.. బాటమ్ చీరకట్టులో కనిపిస్తూ సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ ఔట్ ఫిట్. ఇక చేతులకు గోల్డెన్ కడ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మలయాళ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె తొలిసారి తెలుగులో ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాళవికతో పాటు రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం ఏడాది సంక్రాంతి బడిలో నిలిచి డిజాస్టర్ గా నిలిచింది.

 

అయినా సరే మాళవిక మోహనన్ కి మాత్రం మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్.. 2013లో వచ్చిన మలయాళ చిత్రం పట్టంపోల్ సినిమా ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది. ఇక తర్వాత ది గ్రేట్ ఫాదర్ , పెట్ట , మాస్టర్ , హృదయపూర్వం వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

ఈమె 1993 ఆగస్టు 4న కేరళలోని కన్నూరు జిల్లాలోని పయ్యనూరు పట్టణంలో జన్మించింది. కానీ ముంబైలో పెరిగింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా సీక్వెల్ సర్దార్ 2లో నటిస్తోంది. తమిళ భాష స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

రత్నకుమార్ , ఆశామీరా అయ్యప్పన్ , విగ్నేష్ మునియాండి రచన , నంబి స్క్రీన్ ప్లే అందించారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో కార్తీక్, రజీషా విజయన్ తో పాటు మాళవిక మోహనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు ఆషికా రంగనాథ్, ఎస్ జె సూర్యా కూడా ఈ సర్దార్ 2 లో భాగం కానున్నారు. 2024 జూలైలోనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఈ ఏడాది జూన్లో విడుదల కానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News