పెళ్లి ప్రత్యర్థులనైనా కలుపుతుంది.. ఇదిగో సాక్ష్యం!
| రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన ఈ ముగ్గురూ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ప్రత్యేక ఫ్రేమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజకీయాల్లో రైవల్రీలుగా ఉన్నారు ఎంకే స్టాలిన్- దళపతి విజయ్. ఆ ఇద్దరి పార్టీలు ఎన్నికల్లో ఢీకొట్టాయి. చివరికి తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన సినీనటుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు. ఇక రాజకీయ భావజాలం పరంగా రజనీకాంత్ అభిమానులు దళపతి విజయ్ తో విభేధిస్తున్నారు. వారి మధ్య కూడా కొంత వార్ ఉన్న మాట వాస్తవం.
అయితే ఎన్ని ఉన్నా వీరంతా కళానిధి మారన్ కుమార్తె కావ్యతో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి రిసెప్షన్‌కి విచ్చేసారు. ఈ విందులో ఓ చోట కలుసుకున్నారు. ఒకే ఫ్రేమ్ లో ఫోటోలు కూడా దిగారు. పెళ్లికి ఎంతటి పవర్ ఉందో ఇది మరోసారి నిరూపించింది. ఒక మంచి శుభకార్యం ఉంది.. ఆతిథ్యానికి రండి! అని ఆహ్వానిస్తే శత్రువు అయినా అటెండవ్వాలనే కల్చర్ మన దక్షిణాదికి ఉంది.
రిసెప్షన్లో ముఖ్యమంత్రి విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ ఒకే చోట కలుసుకున్న ఫోటోలు, వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ స్పెషల్ ఫ్రేమ్ సోషల్ మీడియాలో వేగంగా దూసుకెళుతోంది. ముఖ్యంగా రజనీ, విజయ్ అభిమానులు దీనిని అంతర్జాలంలో షేర్ చేస్తున్నారు.
రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు! ఆ రకంగా చూస్తే దళపతి విజయ్ `స్టాలిన్ - మారన్` కుటుంబ వేడుకకు హాజరవ్వడానికి ఎంతమాత్రం నామోషీ చూపించలేదు. అనిరుధ్ రవిచందర్ కి మేనమామ గనుక రజనీకాంత్ ఇప్పుడు స్టాలిన్ - మారన్ కుటుంబానికి బంధువు అయ్యారు. ఆ రకంగా ఆ ముగ్గురూ ఒక వైపు ఉంటే, ఇప్పుడు దళపతి విజయ్ ఒక్కడే ఒక వైపు ఉన్నాడని కూడా విశ్లేషించవచ్చు. ఈ విందులో స్టాలిన్, విజయ్ అద్భుతమైన స్పెషల్ సూట్ లలో జిగేల్మని మెరిసిపోతుంటే, రజనీకాంత్, మారన్ హుందా అయిన డిజైనర్ క్లాస్ సూట్లలో పెద్దరికం ప్రదర్శిస్తున్న వైనం ఆకట్టుకుంది.