• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేదం డైరెక్టర్ తో మళ్లీ...

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

| అల్లు అర్జున్, ‘వేదం’ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ కలిసి పనిచేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది సినిమా కోసం కాదు.. ఓ కమర్షియల్ యాడ్ కోసమట. ఈ ప్రకటనలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

By - Madhu Reddy
Update: 2026-11-21 18:52 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకొని పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకొని అందరినీ ఆశ్చర్యపరచగా.. పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టారు. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది పుష్ప 2.

ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పైగా ఈ చిత్రంలో భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వాడుతున్నారు . మరి ఇందులో అల్లు అర్జున్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరొకవైపు ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బన్నీ మరొకసారి వేదం డైరెక్టర్ క్రిష్ తో జతకట్టబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2010లో అల్లు అర్జున్ , మంచు మనోజ్, అనుష్క శెట్టి, మనోజ్ బాజ్ పేయి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్ సినిమా కోసం కాదట. తాజాగా అందుతున్న సోషల్ మీడియా న్యూస్ ప్రకారం అల్లు అర్జున్ వేదం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఒక కమర్షియల్ యాడ్ కోసం కలిసి పనిచేయబోతున్నట్లు సమాచారం.

పైగా ఈ కమర్షియల్ యాడ్ లో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ కమర్షియల్ యాడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఏది ఏమైనా వేదం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ కాంబో మళ్లీ ఇప్పుడు యాడ్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఏది ఏమైనా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్క క్షణం ఊపిరాగి పోయినంత పని అయిపోయింది.. సినిమా అనుకున్నాము యాడ్ చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలే సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న క్రిష్ ఇప్పుడు సినిమాలు కాకుండా కమర్షియల్ యాడ్ కి దర్శకత్వం వహిస్తున్నారా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఆ కమర్షియల్ యాడ్ ఏంటి? ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ? తదితర విషయాలు ఇంకా వెలువడలేదు.

Tags:    
  • alluarjun 
  • krishjagarlamudi 
  • vedam 
  • ashikaranganath 

Similar News

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

2026-11-21 18:48 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

హనుమాన్-2.. తేలిగ్గా తీసుకోలేం

2026-11-21 17:40 GMT

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

Copyright @2026

Powered by Blink CMS