• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నితిన్ కెరీర్ బెస్ట్.....

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

| నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్‌ను మరో భారతీరాజా అయ్యే సత్తా ఉన్న వ్యక్తిగా నాని అభివర్ణించారు. మ్యూజికల్ జామ్ పార్టీలో సినిమా కథ, నితిన్ నటన, హీరోయిన్ ఆఫియా సయ్యద్‌ను ప్రశంసించారు. తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ ఇదని నితిన్ చెప్పగా, ఈ ప్రేమకథ డిసెంబర్ 4న విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-21 18:48 GMT

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ మ్యూజికల్ జామ్ పార్టీలో నాని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను సమర్పిస్తున్న నాని హీరో, హీరోయిన్‌ను మెచ్చుకోవడంతో పాటు దర్శకుడికి కూడా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇప్పటికే పాటలు, క్యారెక్టర్ గ్లింప్స్‌తో సినిమాకు మంచి బజ్ వచ్చింది. కానీ నాని చెప్పిన పోలిక మాత్రం ఈ చిన్న ప్రేమకథపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఇంతకీ నాని ఎవరితో పోల్చారంటే..

చిన్నప్పుడు భారతీరాజా సినిమాలు చూసే తాను సినిమాలను ప్రేమించడం మొదలుపెట్టానని నాని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ కూడా అలాంటి ఫీలింగ్ ఇచ్చిందని చెప్పారు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్‌కు మన తెలుగు సినిమా నుంచి మరో భారతీరాజా అయ్యే సత్తా ఉందని అభినందించారు. తనదైన ప్రపంచాన్ని సృష్టిస్తూ సింపుల్ కథను అందంగా చెప్పగల దర్శకుడని కూడా ప్రశంసించారు. ఇంత పెద్ద కాంప్లిమెంట్ రావడం మురళీకాంత్‌కు స్పెషల్ అని చెప్పవచ్చు.

పైగా ఈ సినిమా కోసం హడావుడి ఎడిటింగ్ ట్రిక్స్, ప్రత్యేకమైన ప్యాటర్న్స్ అవసరం పడలేదని నాని చెప్పారు. కథలో ఉన్న ఎమోషన్‌ను నమ్ముకుని సినిమా నడిపించారని, మనసుకు హత్తుకునే కథలు కూడా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తాయని వివరించారు. తనకు ఇష్టమైన తరహా సినిమాను సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. 2026 తనకు స్పెషల్‌గా మారడానికి ‘అలియాస్ రుక్మిణి’ కూడా ఒక కారణమని నాని చెప్పడం విశేషం.

మరోవైపు నితిన్ కూడా ఈ సినిమా గురించి బాగానే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ ‘అలియాస్ రుక్మిణి’ అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉందని తెలిపారు. ఇప్పుడే ఎక్కువ విషయాలు చెప్పనని, ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వివరంగా మాట్లాడతానని అన్నారు. కథలోని ఎమోషన్ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పారు. నితిన్ తన సినిమా గురించి ఇంత గట్టిగా చెప్పడం కూడా హైలెట్ అయ్యింది.

సినిమాలో నితిన్ నటన గురించి నాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక్క ఫ్రేమ్‌లో కూడా కృష్ణ పాత్ర నుంచి బయటకు రాలేదని, ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని ప్రశంసించారు. నితిన్ నటుడిగా ఎంత బాగా చేయగలరో ఈ సినిమాలో కనిపిస్తుందని అన్నారు. హీరోయిన్ ఆఫియా సయ్యద్ గురించి కూడా అంతే నమ్మకంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఆమె స్టార్ అవుతారని చెప్పారు.

విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా మారాయి. క్యారెక్టర్లను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీప్తి గంట నిర్మిస్తున్న ఈ సినిమాను నాని సమర్పిస్తున్నారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ డిసెంబర్ 4న విడుదల కానుంది. మ్యూజికల్ జామ్ పార్టీ తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మరిన్ని వివరాలు చెప్పనున్నట్లు నితిన్ తెలిపారు.

Tags:    
  • aliasrukmini 
  • nani 
  • nithiin 
  • muralikanth 
  • afiasyed 

Similar News

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

2026-11-21 18:52 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

హనుమాన్-2.. తేలిగ్గా తీసుకోలేం

2026-11-21 17:40 GMT

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

Copyright @2026

Powered by Blink CMS