• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హై' ట్రైలర్.. యూత్...

'హై' ట్రైలర్.. యూత్ కామెడీలో ఇన్ని ట్రాకులా!

| ‘హై’ ట్రైలర్‌తో దర్శకుడు ఎస్. కృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేమకథలకు కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనన్య శర్మ, ఓల్డ్ సిటీ ప్రేమకథలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కామెడీ, యాక్షన్ సీన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

By - M Prashanth
Update: 2026-11-22 04:32 GMT

ఈ మధ్య చిన్న సినిమాల దర్శకులు కూడా రెగ్యులర్ లవ్ స్టోరీలకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రేమకథకు కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను జోడిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు 'హై' సినిమా కూడా దాదాపు అలాంటి ప్రయత్నమే చేసింది. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్‌లో చాలా పాత్రలు, వాటికి సంబంధించిన సమస్యలను హైలెట్ చేశారు.

అనిల్ రావిపూడి దగ్గర అసోసియేట్‌గా ఉన్న ఎస్. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అంతేకాదు, ప్రధాన పాత్రలో కూడా నటించారు. అనిల్ సినిమాల్లో కామెడీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు కృష్ణ కూడా తన తొలి సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్‌నే ఎంచుకున్నారు. అయితే అనిల్ తరహా ఫ్యామిలీ కామెడీ కాకుండా యూత్‌కు దగ్గరగా ఉండే కథను సిద్ధం చేసుకున్నారు.

హీరోయిన్ అనన్య శర్మ లిప్‌స్టిక్ లావణ్య అనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ఉన్న అమ్మాయిగా కనిపిస్తున్నారు. ఆమె కోసం ఇద్దరు కుర్రాళ్లు పోటీ పడుతుంటారు. మరోవైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సఫీనా, హైదర్ ప్రేమకథ హైలెట్ అయ్యింది. క్రికెట్ బెట్టింగ్ అలవాటున్న హైదర్ కారణంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి. గుడివాడ రాయుడు అనే మరో క్యారెక్టర్ కూడా ఈ కథలో ట్విస్ట్ ఇచ్చేలా ఉంది.

ట్రైలర్ ప్రారంభంలో రైల్వే ట్రాక్‌పై సూసైడ్ ప్రయత్నాన్ని కూడా కామెడీగా చూపించారు. ఆ తర్వాత ప్రేమకథల నుంచి రౌడీల గొడవలు, ఛేజింగ్ సీన్స్ వరకు వెళ్లారు. మధ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్లపై కామెడీ, యూత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఇన్ని అంశాలను రెండు గంటల సినిమాలో సరిగ్గా కలపడం అంత సులభం కాదు. ముఖ్యంగా కామెడీ కోసం ఎంచుకున్న పాత్రలు అసలు కథకు ఎంతవరకు ఉపయోగపడతాయనేది చూడాలి.

ఇక ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీన్స్ కోసం పరిమిత బడ్జెట్‌లోనే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. వికాస్ బడిస బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. శిరీష్ కుమార్, మల్లు బి హలగడ్లి, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా శరణ్ రావుల ఎడిటింగ్.

కొన్ని సన్నివేశాల్లో కామెడీని డైలాగ్స్ కంటే క్యారెక్టర్ల ప్రవర్తనతో తీసుకురావడానికి ప్రయత్నించారు. హరీష్ పెద్దితో కలిసి ఎస్. కృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇక నవంబర్ 27న 'హై' థియేటర్లలోకి రానుంది. ఇక ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • highmovie 
  • skrishna 
  • ananyasharma 
  • telugucinema 

Similar News

ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!

2026-11-22 04:34 GMT

లవ్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీనాక్షి చౌదరి..!

2026-11-22 04:31 GMT

పెళ్లి ప్ర‌త్య‌ర్థుల‌నైనా క‌లుపుతుంది.. ఇదిగో సాక్ష్యం!

2026-11-22 00:20 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

'వడ చెన్నై' లో వెట్రీ మారన్ రాసిన ఆ సీన్ కి ఫిదా అయిపోయిన స్టార్ హీరోలు...

2026-11-21 23:59 GMT

JD సౌంద‌ర్యం, ఫిట్నెస్ సీక్రెట్ తెలిసొచ్చింది!

2026-11-21 23:59 GMT

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

2026-11-21 18:52 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

2026-11-21 18:48 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

Copyright @2026

Powered by Blink CMS