• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర...

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇది విన్నారా?

| సల్మాన్ ఖాన్ అభిమానులకు భజరంగీ భాయిజాన్ సీక్వెల్ విషయంలో నిరాశ ఎదురైంది. 2015లో వచ్చిన ఈ క్లాసిక్ చిత్రానికి రెండో భాగం తీసే ఆలోచన లేదని సల్మాన్ స్పష్టం చేశారు. అయితే దబంగ్ ఫ్రాంచైజీని మాత్రం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా పూర్తయ్యాక దబంగ్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

By - Sivaji Kontham
Update: 2026-11-22 10:41 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరపురాని క్లాసిక్‌గా నిలిచిన 2015 నాటి బ్లాక్‌బస్టర్ చిత్రం `భజరంగీ భాయిజాన్`. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు `బాహుబ‌లి` రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని..తాను కథ కూడా సిద్ధం చేస్తానని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో ఊరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా సల్మాన్ ఖాన్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఆ ఆశలన్నింటికీ ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది. `భజరంగీ భాయిజాన్`కు సీక్వెల్ తీసే ఆలోచన లేదని.. అది సాధ్యం కాదని సల్మాన్ తేల్చి చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భాయిజాన్‌లో పవన్ కుమార్ చతుర్వేదిగా సల్మాన్ పాత్ర‌తో ప్రేక్షకులకు ఏర్పడిన ఎమోషనల్ అటాచ్‌మెంట్.. ఆ కథకు ఉన్న కనెక్ట్‌ను మించిన సినిమా మరోటి రావడం సాధ్యం కాదని సల్మాన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ రెండో భాగం తీసినా.. ప్రేక్షకులు దాన్ని మొదటి భాగంతో పోల్చి `ఇందులో అంత మజా లేదు` అనే పరిస్థితి రాకూడదని అన్న‌రు. అంటే.. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎంతగా సీక్వెల్ రెడీ చేయాలని ప్రయత్నించినా..ఆ స్థాయి భావోద్వేగాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడం కుదరదని సల్మాన్ తన మాటలతో తేల్చేశారన్నమాట.

ఒకవైపు `భజరంగీ భాయిజాన్ 2` ఆశలపై నీళ్లు చల్లిన సల్మాన్ భాయ్.. మరోవైపు తన మాస్ యాక్ష‌న్ ఫ్రాంచైజీ `దబంగ్` అభిమానులకు మాత్రం శుభవార్త చెప్పారు. 2010లో మొదలై.. 2012 , 2019లలో సీక్వెల్స్‌తో అలరించిన `దబంగ్` సిరీస్‌ను కచ్చితంగా కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చుల్‌బుల్ పాండే పాత్రను ముందుకు తీసుకెళ్లే నిర్ణయం పూర్తిగా తమ కుటుంబం చేతుల్లోనే ఉందని.. మిగతా సినిమాల విషయాలు ఇతరుల చేతుల్లో ఉంటాయని స‌ల్మాన్ భాయ్ వ్యాఖ్యానించారు.

దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్న‌ సినిమా పూర్తయిన తర్వాత సల్మాన్ ఖాన్ పూర్తిస్థాయిలో `దబంగ్` ఫ్రాంచైజీపై దృష్టి సారించే వీలుంది. సెన్సిటివ్ పాయింట్ తో రూపొందే సినిమా కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని సల్మాన్.. తనకు బాగా అచ్చొచ్చిన కమర్షియల్- మాస్ యాక్షన్ రూట్‌లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజా స‌న్నివేశం చూస్తుంటే విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌ల్మాన్ భాయ్ కోసం భాయిజాన్ ని మించిన మ‌రో స్క్రిప్టు రాయాల్సి ఉంటుంద‌న్న‌మాట‌.

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. వంశీ పైడిప‌ల్లి `గ్రేట్ హ్యూమ‌న్` అంటూ స‌ల్మాన్ ఇటీవ‌ల `మాతృభూమి` ఈవెంట్లో కితాబిచ్చారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సింక్ కుదిరింది గ‌నుక బ్లాక్ బ‌స్ట‌ర్ లోడింగ్ అని భావించ‌వ‌చ్చు.

Tags:    
  • salmankhan 
  • bajrangibhaijaan 
  • dabangg 
  • vijayendraprasad 

Similar News

భార‌తీయ సినిమాలో 'క‌మ‌ల్ ది గ్రేట్'.. ఎందుకో తెలుసా?

2026-11-22 10:48 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, సంగీత.. కానీ చిన్న ట్విస్ట్!

2026-11-22 10:48 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

Bigg Boss Telugu 10: వంశీ మాటలపై తల దించుకుంటున్నానని చెప్పిన నాగార్జున

2026-11-22 10:39 GMT

Bigg Boss Telugu 10: నీతూ నటరాజ్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ!

2026-11-22 10:38 GMT

జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. వారిద్దరికీ తీవ్ర గాయాలు!

2026-11-22 10:37 GMT

ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!

2026-11-22 04:34 GMT

'హై' ట్రైలర్.. యూత్ కామెడీలో ఇన్ని ట్రాకులా!

2026-11-22 04:32 GMT

లవ్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీనాక్షి చౌదరి..!

2026-11-22 04:31 GMT

పెళ్లి ప్ర‌త్య‌ర్థుల‌నైనా క‌లుపుతుంది.. ఇదిగో సాక్ష్యం!

2026-11-22 00:20 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

Copyright @2026

Powered by Blink CMS