• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిరుధ్ పెళ్లి...

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, సంగీత.. కానీ చిన్న ట్విస్ట్!

| అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత హాజరయ్యారు. అయితే ఇద్దరూ వేర్వేరు సమయాల్లో విడివిడిగా కనిపించడంతో చర్చ మొదలైంది. గతంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్న సంగీత.. తాజాగా కుమారుడి సినిమా విడుదల సమయంలోనూ, ఇప్పుడు ఈ వేడుకలోనూ బహిరంగంగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-22 10:48 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు విజయ్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు ఆయన భార్య సంగీత సోర్నలింగం కూడా రావడం..ఇద్దరూ వేర్వేరు సమయాల్లో విడివిడిగా కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో అనిరుధ్, కావ్య మారన్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాకతో ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. అయితే ఆయనతో పాటు భార్య సంగీత కనిపించకపోవడం ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించింది.

విజయ్ సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకకు హాజరయ్యారు. అనంతరం వేదికపైకి వెళ్లి కొత్త జంట అనిరుధ్, కావ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు కూడా దిగారు. మరోవైపు సంగీత సోర్నలింగం కూడా ఈ వేడుకకు హాజరై కొంతసేపు అందరి దృష్టిని ఆకర్షించారు.

విజయ్, సంగీత 1999 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ దంపతులు కలిసి కనిపించడం లేదు. వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా కుందా రంగ సంగతి తెలిసిందే.

ఈ ఏడాది విజయ్‌పై సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు కారణమైంది. విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం తనకు మానసిక వేదన కలిగించిందని కూడా పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలు గట్టిగానే వచ్చాయి. అయితే కొన్ని విచారణల తర్వాత ఆమె విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఇక ఈ మధ్యనే కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన సిగ్మా సినిమా విడుదల సమయంలో సంగీత తన పిల్లలతో కలిసి కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో మరోసారి ఆమె బహిరంగంగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • vijay 
  • sangeetha 
  • anirudh 
  • kavyamaran 

Similar News

శృంగారం బెస్ట్ వ‌ర్క‌వుట్ కాదంటారా? స్టార్ హీరో ప్ర‌శ్న‌!

2026-11-22 10:58 GMT

మ‌రో క్రేజీ మ్యూజిక‌ల్ బ‌యోపిక్ కి రంగం సిద్ధం

2026-11-22 10:58 GMT

US మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో టాప్-10 మిడ్‌రేంజ్ హీరోలు

2026-11-22 10:57 GMT

భార‌తీయ సినిమాలో 'క‌మ‌ల్ ది గ్రేట్'.. ఎందుకో తెలుసా?

2026-11-22 10:48 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇది విన్నారా?

2026-11-22 10:41 GMT

Bigg Boss Telugu 10: వంశీ మాటలపై తల దించుకుంటున్నానని చెప్పిన నాగార్జున

2026-11-22 10:39 GMT

Bigg Boss Telugu 10: నీతూ నటరాజ్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ!

2026-11-22 10:38 GMT

జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. వారిద్దరికీ తీవ్ర గాయాలు!

2026-11-22 10:37 GMT

ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!

2026-11-22 04:34 GMT

'హై' ట్రైలర్.. యూత్ కామెడీలో ఇన్ని ట్రాకులా!

2026-11-22 04:32 GMT

Copyright @2026

Powered by Blink CMS