శృంగారం బెస్ట్ వర్కవుట్ కాదంటారా? స్టార్ హీరో ప్రశ్న!
| ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’లో అక్షయ్ కుమార్, రవి కిషన్ సందడి చేయనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కరణ్ జోహార్ ప్రశ్నలకు అక్షయ్ ఇచ్చిన సర్కాస్టిక్ సమాధానాలు ఆకట్టుకుంటున్నాయి. ఏడాది పాటు సెక్స్ లేదా వర్కవుట్స్‌లో ఏది వదులుకుంటారని అడగ్గా.. ‘సెక్సే అత్యుత్తమ వర్కవుట్ కదా?’ అంటూ అక్షయ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్‌గా నిలిచింది. బుధవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్- నటుడు కం రాజకీయ నాయకుడు రవి కిషన్ కలిసి `కాఫీ విత్ కరణ్ సీజన్ 9`లో సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు అక్షయ్ కుమార్ ఇచ్చిన ఫన్నీ సర్కాస్టిక్ సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వినోదం, హాస్యంతో కూడుకున్న ఈ ఎపిసోడ్ బుధవారం ప్రసారం కానుంది.
ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కరణ్ నేరుగా అక్షయ్‌ను `ఖిలాడీ నం. 1`గా, రవి కిషన్‌ను `కింగ్ ఆఫ్ వైరాలిటీ`గా అభివర్ణించారు. రక్తంలో పంజాబీతనం.. బాలీవుడ్ ఐకాన్ అయిన అక్షయ్ కుమార్‌తో పాటు జెన్-జీ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే రవి కిషన్`` ఒకే వేదికపై వినోదాన్ని పంచనున్నారని కరణ్ తెలిపారు. ఈ షోతోనే రవి కిషన్ తొలిసారిగా `కాఫీ విత్ కరణ్` వేదికపై అడుగుపెట్టడం విశేషం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రవి కిషన్‌ను తనతో పాటు గెస్ట్‌గా తీసుకురావాలనే ఆలోచన స్వయంగా అక్షయ్ కుమార్‌దేనని కరణ్ వెల్లడించారు. రవి కిషన్‌లోని కామెడీ కోణమే కాకుండా.. ఆయన ఎంత ఎమోషనల్ పర్సనాలిటీ అనే విషయాన్ని కూడా అక్షయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని పైకి వచ్చిన వ్యక్తిగా కిషన్ గురించి మాట్లాడటం ఎపిసోడ్‌లోని మరో ఆకర్షణగా నిలిచింది.
ఇక ట్రైలర్‌లో ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. కఠినమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణతో కూడుకున్న జీవనశైలికి మారుపేరుగా ఉన్న అక్షయ్‌ను ఒక ఏడాది పాటు సెక్స్‌ను వదులుకుంటారా లేక వర్కవుట్‌లను వదులుకుంటారా? అని కరణ్ ప్రశ్నించగా..అక్షయ్ తనదైన శైలిలో స్పందించారు. `సెక్సే అత్యుత్తమ వర్కవుట్ కదా?`` అంటూ అతడు వేసిన కౌంటర్ దూసుకెళ్లింది.
వీటితో పాటు రవి కిషన్‌కు ఉన్న `బీహార్ బ్రాడ్ పిట్` అనే ముద్దుపేరుపై కరణ్ చేసిన సరదా వ్యాఖ్యలు చేయగా ఎపిసోడ్ ఆద్యంతం అక్షయ్ జోకులతో నిండిపోయింది. ఖిలాడీ కుమార్ పంచ్‌లు, రవి కిషన్ వైరల్ ఎనర్జీ కలగలిసిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.