ది ప్యారడైజ్ మేకర్స్‌ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
ఇక అసలు విషయానికొస్తే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయి వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి ఎన్ని సూపర్ హిట్లు ఉన్నా సరే వేరే ఇండస్ట్రీ వాళ్లు తెలుగు సినిమాను చాలా చులకనగా చూసేవారు. కానీ ఇప్పుడలా కాదు. బాహుబలి తర్వాత దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.
తెలుగు సినిమా కు పెరిగిన క్రేజ్
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత అయితే వరల్డ్ సినిమా వద్ద తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లింది. ఏకంగా ఈ మూవీకి ఆస్కార్ కూడా రావడంతో ప్రపంచమంతటి దృష్టి టాలీవుడ్ వైపుకి మళ్లింది. అందుకే తెలుగు డైరెక్టర్లతో కలిసి వర్క్ చేయడానికి మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు సినిమా క్రేజ్ పెరగడంతో ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు.
బడ్జెట్ విషయంలో రాజీ పడని మేకర్స్
అందులో భాగంగానే బడ్జెట్ విషయంలో కూడా రాజీపడటం లేదు. సినిమా అందరినీ మెప్పించాలంటే కథ నుంచి ప్రతీదీ రిచ్ గానే ఉండాలని, డైరెక్టర్ అడిగినంత ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇంకా చెప్పాలంటే సినిమా రిచ్ గా ఉండటానికి అడిగిన దానికంటే ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. డైరెక్టర్ అడిగిన క్యాస్టింగ్ నుంచి, టెక్నీషియన్ల వరకు నిర్మాతలు అన్నీ ఇస్తూ రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్
ఇక అసలు విషయానికొస్తే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత నాని- శ్రీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా శ్రీకాంత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పటికే బడ్జెట్ భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.
రూ.200 కోట్లు దాటిన బడ్జెట్
ఇప్పటికే ది ప్యారడైజ్ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు దాటిందని, సినిమా పూర్తయ్యే నాటికి బడ్జెట్ మరింత పెరుగుతుందని, నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఇదేనని అంటున్నారు. ది ప్యారడైజ్ విషయంలో శ్రీకాంత్ భారీగా ఖర్చు పెడుతున్నారని క్యాస్టింగ్ ను బట్టే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను విలన్ గా తీసుకున్న శ్రీకాంత్, సెట్స్ కోసం కూడా భారీ బడ్జెట్‌నే పెడతున్నారు. నాని ఖాతాలో వరుస హిట్లు ఉన్నప్పటికీ ఇంత బడ్జెట్ అతనొక్కడే తిరిగి రికవరీ చేయడమంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. కానీ మేకర్స్ మాత్రం అవేవీ ఆలోచించకుండా సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టడం చూస్తుంటే వారిది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా అనేది అర్థం అవడం లేదు.