ఈషా మరో టీజర్.. ఇది దెయ్యం వార్నింగ్

హార్రర్ సినిమాలకు ఎప్పుడూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. థియేటర్లో భయపడటానికి ఆడియెన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు.;

Update: 2025-12-20 07:13 GMT

హార్రర్ సినిమాలకు ఎప్పుడూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. థియేటర్లో భయపడటానికి ఆడియెన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పుడు అదే జోష్ తో 'ఈషా' అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, చిన్న గ్లింప్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మేకర్స్ మరో టీజర్ ను వదిలారు. దీనికి 'వార్నింగ్' అని పేరు పెట్టడం చూస్తుంటేనే మ్యాటర్ సీరియస్ గా ఉందని అర్థమవుతోంది.

టీజర్ ఓపెనింగ్ షాట్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. సమాధులు, వాటి మీద వింత బొమ్మలు, బ్లాక్ మ్యాజిక్ గుర్తులు చూస్తుంటే వణుకు పుట్టేలా ఉంది. మామూలు హార్రర్ సినిమాల్లా కాకుండా, ఇందులో ఏదో డార్క్ కాన్సెప్ట్ ఉందని క్లియర్ గా తెలుస్తోంది. ఆ రాత్రి వేళ వచ్చే విజువల్స్, ఆ సైలెన్స్ భయాన్ని పెంచేస్తున్నాయి.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే వాయిస్ ఓవర్ సినిమా థీమ్ ఏంటో చెప్పకనే చెప్పింది. "మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి.. తర్వాత క్రమంగా అవి ఆత్మలకు నిలయాలుగా మారతాయి" అనే డైలాగ్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఒక పాతబడిన బంగ్లా, దానికి పట్టిన శాపం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఈ లైన్ హింట్ ఇస్తోంది.

ఇక టీజర్ లో అసలైన హైలైట్ ఆ వార్నింగ్ సీన్. ఒక వ్యక్తికి దెయ్యం పట్టినట్లు, కళ్లు భయంకరంగా తెరిచి "ఎవర్నీ వదలను.. అందర్నీ చంపేస్తా" అని అరవడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఆ సీన్ లో ఇంటెన్సిటీ పీక్స్ లో ఉంది. దెయ్యం బాడీని ఆక్రమించుకున్నప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు.

హీరోయిన్ హెబ్బా పటేల్, హీరో త్రిగున్ మొహాల్లో ఆ భయం స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్ గా చూస్తే సౌండ్ డిజైన్ భయపెట్టేలా ఉంది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా, ఆ మూడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. "ఆత్మ అంటే అదేనేమో" అనే డైలాగ్ తో ఎండింగ్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది.

బన్నీ వాస్, వంశీ నందిపాటి లాంటి వాళ్లు ఈ సినిమా వెనుక ఉండటం ప్రాజెక్ట్ కు ప్లస్ పాయింట్. మొదట వేరే డేట్స్ అనుకున్నా, ఫైనల్ గా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. రొటీన్ గా కాకుండా ఏదో కొత్త పాయింట్ తో భయపెట్టేలా ఉన్న ఈ 'ఈషా' బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.



Tags:    

Similar News