అక్కినేని కాంపౌండ్ కి మెగాస్టార్ స్క్రిప్ట్ తోనా!
కళ్యాణ్ కృష్ణ పరిచయం అవసరం లేని పేరు. అక్కినేని హీరోలకు వరుసగా మూడు హిట్లు ఇచ్చిన డైరెక్టర్.;
కళ్యాణ్ కృష్ణ పరిచయం అవసరం లేని పేరు. అక్కినేని హీరోలకు వరుసగా మూడు హిట్లు ఇచ్చిన డైరెక్టర్. 'మనం' తర్వాత కింగ్ నాగార్జున తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయాలని ఉన్న సందిగ్దంలో కళ్యాణ్ కృష్ణ ఆ కాంపౌండ్ లో ఎంటర్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితుడు కావడంతో? కల్యాణ్ కృష్ణకు అక్కినేని కాంపౌండ్ లో ఎంట్రీ సులభమైంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' కథను తొలుత చిరంజీవి విని నాగార్జునకైతే బాగుంటుందని రిఫర్ చేయడంతో? నాగ్ ఆ స్క్రిప్ట్ ను ఒకే చేసారు. కళ్యాణ్ కొత్త కుర్రాడు అయినప్పటికీ..దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేనప్పటికీ కథ సహా చిరంజీవి మాటపై నమ్మకంతో ముందుకెళ్లారు. ఆ నమ్మకాన్ని కల్యాణ్ కృష్ణ నిల బెట్టుకున్నాడు.
ఆ సినిమాతో నాగార్జునకు సరైన హిట్ ఇచ్చాడు. అనంతరం యువ సామ్రాట్ నాగచైతన్యతో 'రారండోయ్ వేడెక చూద్దాం' తెరకెక్కించి చై ఖాతాలో సైతం మరో విజయాన్ని నమోదు చేసాడు. ఇలా రెండు విజయాలు కళ్యాణ్ కృష్ణకు మంచి బ్రేక్ నిచ్చాయి. కానీ ఒక్క పరాజయం కల్యాణ్ కృష్ణను డైరెక్టర్ల రేసులో లేకుండానే చేసింది. అదే 'నేల టికెట్' . రవితేజ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఇండస్ట్రీలో కల్యాణ్ కృష్ణని నమ్మే హీరోలే లేకుండాపోయారు. మళ్లీ డైరెక్టర్ గా కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి ఏకంగా నాలుగేళ్లు సమయం పట్టింది. ఆ ఛాన్స్ కూడా కింగ్ నాగార్జునే 'బంగార్రాజు' రూపంలో కల్పించారు. ఈసారి కూడా నాగ్ నమ్మకాన్ని అంతే బలంగా బెట్టాడు.
కమర్శియల్ గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అప్పటికే నాగార్జున వరుస ప్లాప్ ల్లో ఉన్నారు.చేస్తోన్న ప్రయోగాలు ఫలించని సమయంలో 'బంగార్రాజు'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ విజయాలన్నింటిని నిశితంగా పరిశీలించిన మెగాస్టార్ చిరంజీవి తానేందకు కల్యాణ్ తో పని చేయకూడదనుకున్నారు. ఈ క్రమంలో లోనే చిరంజీవి తన 157వ చిత్రాన్ని కల్యాణ్ కృష్ణతో లాక్ చేసారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ అసంతృప్తిగా ఉన్నారు. ఆ కారణంగా ఆగిపోయిందన్న వార్త తెరపైకి వచ్చింది.
తాజాగా కల్యాణ్ కృష్ణ మరోసారి నాగార్జున తో జత కడుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరిది హిట్ కాంబినేషన్ కావడంతో? ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అయితే ఈసారి కింగ్ కు ఎలాంటి స్టోరీ రాసాడు? అన్నది ఇంట్రెస్టింగ్. ఇక్కడే మరో సందేహం కూడా వ్యక్తమవుతోంది. చిరంజీవికి రాసిన స్క్రిప్ట్ లోకి నాగార్జునను తీసుకొస్తున్నారా? లేక కింగ్ కోసం సపరేట్ స్టోరీ సిద్దం చేసాడా? అన్న డైలమా నడుస్తోంది. అక్కినేని హీరోలకు మూడు విజయాలు ఇచ్చాడు కాబట్టి కల్యాణ్ ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. స్టోరీ పరంగా కింగ్ ను ఎలాగైనా లాక్ చేయగలడు. కాకపోతే ఆ కథ ఏంటన్నదే ఆసక్తికరం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.