ఆ స్టెప్ పెద్ద ఆర్టిస్ట్‌లే తీసుకోవాలి!

`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా బ‌డ్జెట్ చుక్క‌ల్ని తాకేస్తోంది. ఏ హీరో సినిమా బ‌డ్జెట్ గురించి ఆరా తీసినా వంద కోట్ల పై మాటే వినిపిస్తోంది.;

Update: 2025-12-20 06:45 GMT

`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా బ‌డ్జెట్ చుక్క‌ల్ని తాకేస్తోంది. ఏ హీరో సినిమా బ‌డ్జెట్ గురించి ఆరా తీసినా వంద కోట్ల పై మాటే వినిపిస్తోంది. వంద‌ల కోట్లు కాస్తా ఈ మ‌ధ్య వెయ్యి కోట్ల‌కు చేరింది. మ‌హేష్‌తో జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న పాన్ వ‌ర‌ల్డ్‌ మూవీ `వార‌ణాసి`ని రూ.1300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే టాలీవుడ్‌తో పాటు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే సినిమాల మేకింగ్‌, బ‌డ్జెట్‌ల‌పై హీరో శివాజీ తాజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. `#90`s` సిరీస్‌తో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన శివాజీ మ‌ళ్లీ వ‌రుస విజ‌యాల‌తో ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ రీ స్టార్ట్ చేసిన శివాజీ ప్ర‌స్తుతం ప‌లు కీల‌క ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `దండోరా` డిసెంబ‌ర్ 25న‌ రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాలో ముచ్చ‌టిస్తూ సినిమా బ‌డ్జెట్‌, మేకింగ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఆ రోజుల్లో మేము రూ.78 ల‌క్ష‌ల్లో బూచ‌మ్మ బూచోడు` సినిమా చేశాం. అలాగే కోటీ పాతిక ల‌క్ష‌ల్లో `మా ఆయ‌న చంటి పిల్లాడు` తీశాం. రూ.80 ల‌క్ష‌ల నుంచ రూ.90 ల‌క్ష‌ల మ‌ధ్య‌లో `టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా` చేశాం. ఈ రోజుల్లోనే అదే బ‌డ్జెట్‌తో సినిమాలు తీయోచ్చు. పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. స్క్రిప్ట్‌, మేకింగ్‌మీద నీకు మంచి కమాండ్‌, గ్రిప్ ఉండాలి ఆ రెండూ ఉంటే లిమిటెడ్ బ‌డ్జెట్‌లో సినిమా తీయ‌డం ఈ రోజుల్లో పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

లిమిటెడ్ బ‌డ్జెట్‌లో చేయ‌గ‌ల స్క్రిప్ట్‌ని ఎంచుకుని దానికి మ‌న బ్రాండ్‌ని వాడుకుని మార్కెట్‌లోకి వెళితే ఎంతో మంది వ‌స్తారు. మ‌న‌ద‌గ్గ‌రున్న ప్రాజ‌బ్ల‌మ్ ఏంటంటే మ‌న క‌ళ్ల‌న్నీ పెద్ద పెద్ద న‌క్ష‌త్రాల‌ని చూసేసి కిందికి రాలేక‌పోతున్నారు. సినిమాకు చిన్నా పెద్దా ఏమీ ఉండ‌దు. బ్డ‌జెట్ ప‌రంగా పెద్దా చిన్నా అని తేడా ఉంటుందే కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండ‌దు. ఈ మ‌ధ్య తెలుగులో విడుద‌లైన లిటిల్ హార్ట్స్‌, రాజు వెడ్స్ రాంబాయి, మ‌ల‌యాళంలో విడుద‌లైన `కొత్త‌లోక‌` ఇవ‌న్నీ చిన్న బ‌డ్జెట్‌లో చేసిన సినిమాలు. లిటిల్ హార్ట్స్ అయితే 2.6లోనో చేశారు.

పెద్ద ప్రొడ్యూస‌ర్లు, హీరోలే పెద్ద బ్రాండ్‌లు.. అది గ‌మ‌నించక వీళ్లే పెద్ద బ్రాండ్ కోసం పాకులాడుతూ దెబ్బ‌తింటున్నార‌ని నా ఫీలింగ్‌. మ‌ల‌యాళ సినిమాలు చాలా వ‌ర‌కు త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుంటే ఒక్కో సినిమా వంద కోట్లు, రెండు వంద‌ల కోట్లు..మూడు వందల కోట్లు రాబ‌డుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన `కొత్త‌లోక‌` రూ.300 కోట్లు రాబ‌ట్టి టాప్‌లో నిలిచింది. నా ఉద్దేశ్యం ఏంటంటే సినిమా చేసిన త‌రువాత నీ కంటూ ఇంత రెవెన్యూ ఱేస్ పెట్టుకో అప్పుడు బ్ర‌హ్మాండంగా ఉంటుంది క‌దా? అలా చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌లు సేఫ్‌. ఈ విష‌యంలో ఎక్క‌డో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలి జ‌రుగుద్ది. ఆ స్టెప్ పెద్ద ఆర్టిస్ట్‌లే తీసుకోవాలి.. అంటూ శివాజీ సినిమా మేకింగ్‌, బ‌డ్జెట్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Tags:    

Similar News