ఎంతటి వారైనా అనుభవించాల్సిందే!

సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.;

Update: 2025-12-20 06:55 GMT

సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అవకాశాల పేరిట ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న ఎంతోమంది హీరోయిన్లు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది సీనియర్ హీరోయిన్స్ కి కూడా ఇలాంటి సమస్యలు తప్పలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక కమిటీని కూడా వేసారు..ముఖ్యంగా ఈ కమిటీ సమర్పించిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అందుకే ఇలాంటి కమిటీలు అన్ని భాష ఇండస్ట్రీలలో వేయాలి అని సీనియర్ స్టార్ హీరోయిన్లు కూడా కోరిన విషయం తెలిసిందే. వారి కోరికతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనే అనుమానాలు కలిగాయి.

ఇకపోతే కమిటీలు వచ్చిన తర్వాత కూడా చాలామంది హీరోయిన్స్ ఇప్పటికీ ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరి తమ బాధలను చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా నిన్నటికి నిన్న ప్రముఖ హిందీ బిగ్ బాస్ సీజన్ 19 కంటెస్టెంట్ , ప్రముఖ నటి మాల్టీ చాహర్ ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి నోరు విప్పగా.. ఇప్పుడు మరో బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఆ సమయం వస్తే ఎంతటి ధైర్యవంతులైనా సరే ఆ భయాన్ని అనుభవించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాధిక ఆప్టే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరియర్ గురించి.. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. రాధిక ఆప్టే మాట్లాడుతూ.." ఒకప్పుడు ఆర్థిక సమస్యల కారణంగానే నేను సౌత్ లో సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ఇక తప్పని పరిస్థితిలో డబ్బు అవసరం కాబట్టే దక్షిణాది సినిమాలలో నటించాను. నిజానికి కొన్నిసార్లు సెట్స్ లో భయంకరమైన అనుభవాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది . మారుమూల పట్టణాల్లో షూటింగ్ కి వెళ్తే.. సొంత సిబ్బందిని కూడా సెట్ లోకి రానిచ్చేవారు కాదు.

ఆ సమయంలో మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేసేవారు. చాలా అసౌకర్యంగా ఉండేది.ఆ రోజుల గురించి ఆలోచిస్తే ఇప్పటికీ భయం వేస్తోంది " అంటూ రాధిక చెప్పుకొచ్చింది.. ఇక రాధిక చేసిన ఈ కామెంట్లు చూస్తుంటే బోల్డ్ బ్యూటీగా, ధైర్యవంతురాలిగా పేరు సొంతం చేసుకున్న రాధిక ఆప్టేకి కూడా ఇలాంటి సమస్యలు తప్పలేదా అంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..రాధిక విషయానికి వస్తే.. 2005లో హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె...ఆ తర్వాత తమిళ్, మలయాళం, మరాఠీ , తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది.

Tags:    

Similar News