• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాపం...హిట్ సినిమాలున్నా...

పాపం...హిట్ సినిమాలున్నా ఆఫర్స్ మాత్రం నిల్

By - Tupaki Desk
Update: 2020-03-18 11:20 GMT
నిధి అగర్వాల్ పరిచయం అవసరంలేని హీరోయిన్. యూత్ లో ఆమెకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ, వయ్యారాలు ఒలకబోసే ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్.. తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే, తన డాన్సులతో అదరగొట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి, తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా టాలీవుడ్ లో తన పేరు గుర్తుండిపోయేలా చేసాయి. గత ఏడాది డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో హీరోయిన్ గా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది.

అయితే 'ఇస్మార్ట్ శంకర్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినా తెలుగులో మాత్రం తనకు అవకాశాలు మాత్రం రావడం లేదంట. తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో చేస్తున్న సినిమా మినహా ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదని సమాచారం. ఈ మధ్య ఒక ప్రముఖ కథానాయకుడి తో నటిస్తుందని వార్తలు వెలువడినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. హిట్ సినిమా చేసిన తర్వాత కూడా టాలీవుడ్లో పెద్ద ఆఫర్లు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన నటనతో డాన్సులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే నిధి అగర్వాల్ ఈ ఏడాది పలు చిత్రాలతో కన్నడ మరియు తమిళంలో అడుగుపెట్టనుంది. రాబోయే రోజుల్లో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చి టాలీవుడ్ లో అగ్ర కథానాయకిగా నిలిచి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    
  • Niddhi Aggarwal 
  • Nabha Natesh 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS