ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కోసం కొత్త అప్ డేట్‌ రెడీ

Update: 2021-06-26 07:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జులై చివరి వరకు పూర్తి అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్‌ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ రెండు ప్రాజెక్ట్‌ లను పట్టాలెక్కించాల్సి ఉంది. ఇప్పటికే ఆ రెండు కూడా అధికారిక ప్రకటన వచ్చేశాయి. అందులో మొదటిది కొరటాల శివ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా కాగా రెండవది జెమిని టీవీలో ప్రసారం కావాల్సిన ఎవరు మీలో కోటీశ్వరులు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్ ముగింపు కోసం వెయిట్‌ చేస్తున్న జెమిని వారు త్వరలోనే షో ను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా అదుగో ఇదుగో అంటూ కమింగ్‌ సూన్‌ ప్రోమోను విడుదల చేస్తూ వస్తున్న జెమిని వారిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం కమింగ్ సూన్‌ అంటూ వేస్తారు అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే కొత్త అప్ డేట్‌ ను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందు పలు ముఖ్య పట్టణాల్లో ఎవరు మీలో కోటీశ్వరులు ఆడిషన్స్ జరిగాయి. కరోనా కారణంగా వాటిని నిలిపి వేశారు. మళ్లీ ఆడిషన్స్ ను పునః ప్రారంభించేందుకు జెమిని వారు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆడిషన్స్ కు సంబంధించిన అప్‌ డేట్‌ ను ఇవ్వాలని జెమిని టీవీ వారు ఏర్పాట్లు చేస్తున్నారని.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులోనే ఈ షో ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కొరటాల శివ మూవీ తో పాటు సమాంతరంగా షో ను కూడా ఎన్టీఆర్‌ చేయబోతున్నాడు. షో కోసం ఎన్టీఆర్‌ వారంలో రెండు రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్‌ లు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మరో ప్రతిష్టాత్మక మూవీని కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News