కాజల్.. ఒక్క వీడియోతో ఇచ్చిపడేసిందిగా!
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కాజల్.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.;
స్టార్ హీరోయిన్ కాజల్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కాజల్.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా సినిమాల వల్ల కాకుండా.. తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చిన తీరు కారణంగా వార్తల్లో నిలిచారు. ఒక్క వీడియోతో ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు.
రీసెంట్ గా కాజల్ అగర్వాల్ లుక్ పై నెటిజన్ల నుంచి తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. పెళ్లి తర్వాత, మాతృత్వాన్ని అనుభవించిన అనంతరం ఆమె కొంత బరువు పెరిగారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. అదే సమయంలో కొందరు నెటిజన్లు హద్దులు దాటి కామెంట్ చేయడం చర్చకు దారి తీసింది. ఆ తర్వాత రీసెంట్ గా గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ లో కాజల్ పేరు టాప్ సెర్చ్ లిస్ట్ లో లేకపోవడంపై మరికొందరు ట్రోల్ చేశారు.
గతంలో వరుసగా ఎన్నో సంవత్సరాలు మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా నిలిచిన కాజల్, ఈసారి ఆ జాబితాలో వెనుకబడటాన్ని ఆమె లుక్ తో లింక్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలకు మాటలతో కాదు… పనితో సమాధానం ఇవ్వాలని కాజల్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన జిమ్ వర్కౌట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దాని ద్వారా కాజల్ ఫిట్‌నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
హార్డ్ ఎక్సర్సైజ్ చేస్తూ పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో కనిపించిన కాజల్ లుక్ ఇప్పడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోతో కాజల్ తనపై వచ్చిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే అసలైన ఆన్సర్, మాటల కంటే పనితో చూపించిందని, కాజల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రోలింగ్ చేసిన వారికి ఇది సరైన సమాధానం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాజల్ కెరీర్ విషయానికి వస్తే… ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమె, కోలీవుడ్ లోనూ టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. విజయ్, అజిత్, సూర్య, పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతున్న కాజల్, ఫిట్ నెస్ పై కూడా అదే స్థాయిలో శ్రద్ధ చూపుతున్నారని లేటెస్ట్ వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది.
ఇక సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉండే కాజల్, ఈ మధ్య ఫిట్ నెస్ జర్నీ పోస్టులు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతే ముఖ్యమని, ఇతరుల మాటల కంటే తనపై తనకు నమ్మకం ఉండాలని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్టుగా ఆమె పోస్టులు కనిపిస్తున్నాయి.