యూత్ కోసం జియో హాట్‌స్టార్ కొత్త ప్లాన్

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో మైక్రో కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటివి ప్రేక్షకుల వీక్షణ అలవాట్లను పూర్తిగా మార్చేశాయి.;

Update: 2026-03-04 00:30 GMT

ఐపీఎల్ సీజన్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండగే. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల మధ్య ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఓటీటీ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ సీజ‌న్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభమయ్యే నాటికి క్రికెట్‌తో పాటు షార్ట్ ఫార్మాట్ స్టోరీస్ ను అందిస్తూ యూత్‌ను మరింతగా ఎంగేజ్ చేయడానికి జియో హాట్‌స్టార్ ప్రత్యేక వ్యూహంతో ముందుకొచ్చినట్టు సమాచారం.

100 మైక్రో డ్రామాల‌ను రెడీ చేసిన జియో హాట్‌స్టార్

సాధారణంగా ఐపీఎల్ సమయంలో పెద్ద సినిమాల విడుదలను నిర్మాతలు నివారిస్తారు. కారణం తెలిసిందే. యూత్ ఫోకస్ మొత్తం క్రికెట్‌పైనే ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రేక్షకుల అటెన్షన్‌ను పూర్తిగా కోల్పోకుండా, మ్యాచ్‌ల మధ్య ఉన్న చిన్న గ్యాప్‌లను వినియోగించుకోవాలని ఓటీటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో హాట్ స్టార్ సుమారు 100 మైక్రో డ్రామాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌ల మధ్యలో వీటిని ప్రసారం చేయనున్న‌ట్టు స‌మాచారం.

మైక్రో కంటెంట్ పై యూత్ ఆస‌క్తి

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో మైక్రో కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటివి ప్రేక్షకుల వీక్షణ అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఒకే అంశంపై గంటల తరబడి కూర్చొని చూడటానికి ఆసక్తి చూపని కొత్త తరానికి 60 నుండి 90 సెకన్ల మధ్యలో ముగిసే కథలు మరింత దగ్గరగా ఉంటున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మైక్రో డ్రామాల నిడివి 60–180 సెకన్ల మధ్య ఉండనుంది. కంటెంట్ స్వభావాన్ని బట్టి ఒక్కో ఎపిసోడ్‌ను కట్ చేసి ప్రసారం చేస్తారు.

యాప్ ఎంగేజ్‌మెంట్ ను పెంచ‌డ‌మే టార్గెట్

రివెంజ్, రొమాన్స్, సస్పెన్స్, ట్విస్ట్ లాంటి అంశాలతో ఈ 100 మైక్రో కథలను తీర్చిదిద్దినట్టు సమాచారం. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఒక ఆసక్తికర మలుపు ఉండేలా రూపొందించడం ద్వారా తదుపరి భాగాన్ని చూడాలనే ఆసక్తిని పెంచే విధంగా ప్లాన్ చేశారు. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోగం మాత్రమే కాదు.. ఓటీటీ బిజినెస్ స్ట్రాటజీ కూడా. ఇప్పటివరకు మ్యాచ్‌ల మధ్యలో ప్రధానంగా యాడ్స్‌కే పరిమితమైన విరామాన్ని ఇప్పుడు కంటెంట్ జోన్‌గా మార్చడం ద్వారా యాప్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

యూత్ ను ఆక‌ర్షించ‌డానికే ప్ర‌య‌త్నాలు

యూత్ సైకాలజీని బాగా అర్థం చేసుకుని తీసుకున్న నిర్ణయంగా దీనిని చూడవచ్చు. ఐపీఎల్ సమయంలో ప్రేక్షకులు ప్లాట్‌ఫారమ్‌ను వదిలి వెళ్లకుండా, అదే స్క్రీన్‌పై కొత్త అనుభవాన్ని అందించడం ద్వారా రిటెన్షన్ పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఈ మైక్రో డ్రామాలను స్ట్రీమ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో పాన్ ఇండియా స్థాయిలో యూత్ ను ఆకర్షించే అవకాశం ఉంది. మొత్తానికి, క్రికెట్ పండుగ మధ్యలో వీటిని జోడించడం ద్వారా ఐపీఎల్‌ను కేవలం స్పోర్ట్స్ ఈవెంట్‌గా కాకుండా పూర్తి స్థాయి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్‌గా మార్చే ప్రయత్నంగా ఈ కొత్త ప్రయోగాన్ని చూడవచ్చు.

Tags:    

Similar News