సాయి ప‌ల్ల‌వికిది స‌రైన స‌మ‌య‌మేనా?

గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో పాటు త‌న‌ను నటిగా మరింత నిరూపించుకోవడానికి ఇలాంటి ఎమోషనల్ లేడీ ఓరియేంటెడ్ కథలు ఎంతో దోహదపడతాయని అభిమానులు భావిస్తున్నారు.

Update: 2026-07-24 02:45 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సహజ నటి సాయిపల్లవి కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉంది. డ్యాన్స్, అభినయం, కథల ఎంపికలో ప్రత్యేకత చాటుకుంటూ ముందుకు సాగుతున్న ప‌ల్ల‌వికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కిషోర్ తిరుముల బలమైన లేడీ ఓరియేంటెడ్ స్క్రిప్ట్‌తో సాయిపల్లవిని సంప్రదించారని.. ఆమె కూడా ప్రాజెక్ట్‌పై సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాపై ఆమె ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో సాయిపల్లవి కెరీర్ గ్రాఫ్ .. మార్కెట్ స్థాయిని బట్టి చూస్తే లేడీ ఓరియేంటెడ్ సినిమా చేయడం సరైన నిర్ణయమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కమర్షియల్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ సాయిపల్లవి మొదటి నుంచీ గ్లామర్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న, ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రంలో మాత సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యష్ వంటి దిగ్గజ నటులతో కలిసి న‌టిస్తోన్న గ్లోబల్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. `రామాయణం` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తే సాయిపల్లవి పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. ఆ స్థాయి గ్లోబల్ ఇమేజ్ వచ్చే సమయంలో ఇలాంటి ప్రాంతీయ, లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయడం సాయి ప‌ల్ల‌వికి ఏ మేరకు ప్లస్ అవుతుందనే కోణంలో చ‌ర్చ జ‌రుగుతోంది. మరో కోణంలో చూస్తే సాయిపల్లవి బలం గ్లామర్ కాదు. నటనపై ఉన్న నమ్మకమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది.

గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో పాటు త‌న‌ను నటిగా మరింత నిరూపించుకోవడానికి ఇలాంటి ఎమోషనల్ లేడీ ఓరియేంటెడ్ కథలు ఎంతో దోహదపడతాయని అభిమానులు భావిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల తీసేయాల్సిన ద‌ర్శ‌కుడు కాదు. `నేను శైల‌జ` లాంటి సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత చేసిన కొన్ని సినిమాలు యావ‌రేజ్ గా ఆడాయి. అయితే భారీ విజ‌యం మాత్రం ఇంకా అత‌డి ఖాతాలో న‌మోద‌వ్వ‌లేదు. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసిన అనుభ‌వం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో సాయిప‌ల్ల‌వి కాస్త రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇలాంటి సాహ‌సాలు ఆమెకు కొత్తేం కాదు. క‌థ న‌చ్చిదంటే ద‌ర్శ‌కుడి అనుభ‌వంతో ప‌నిలేకుండా ముందుకెళ్తుంది. అలాంటి ప్ర‌యోగాలు కొన్ని త‌మిళ సినిమాల‌తో చేసారు. కానీ అవి ఆశీంచిన ఫ‌లితాలివ్వ‌లేదు. న‌టిగా త‌న వ‌ర‌కూ పాస్ అయినా? ఫ‌లితాలు ఆశీంచిన విధంగా రాక‌పోవ‌డంతో ఆ త‌ర్వాత మ‌ళ్లీ లేడీ ఓరియేంటెడ్ అటెంప్స్ట్ చేయ‌లేదు. పూర్తిగా క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో సాయి ప‌ల్ల‌వి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News