టాలీవుడ్‌లో లేని 'బాస్ కల్చర్' బాలీవుడ్‌లోనే ఎందుకు?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం `బాస్ కల్చర్`పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Update: 2026-07-24 03:49 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం `బాస్ కల్చర్`పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమ అయిన టాలీవుడ్‌లో కార్పొరేట్ పద్ధతుల కంటే సృజనాత్మకతకు, మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మేకర్స్, నటుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది. కానీ బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో మాత్రం మొదటి నుంచీ `బాసిజం`, కార్పొరేటీకరణే రాజ్యం ఏలుతున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.

బాలీవుడ్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. బాసిజంతో పాటు నేపోటిజం (వంశపారపర్యం), రేసిజం కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తాయనే డిబేట్ నడుస్తోంది. అక్కడ కథలకు, అసలైన క్రియేటివిటీకి పెద్దపీట వేయకుండా... సినిమాలను కేవలం కార్పొరేట్ వ్యాపార కోణంలోనే చూడటం వల్లే బాలీవుడ్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సరిగ్గా ఇలాంటి విమర్శలు... సవాళ్లు ఎదురవుతున్న సమయంలోనే బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ `యష్ రాజ్ ఫిలింస్` (వైఆర్ఎఫ్‌) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో ఉషా రాచెల్ థామస్ ను `హెడ్ ఆఫ్ క్యూనికేషన్స్ స్ట్రాటజీ`గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కార్పొరేట్ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునే దిశగా YRF ఈ అడుగు వేసింది.

ఇంతకీ ఈ `హెడ్ ఆఫ్ క్యూనికేషన్స్ స్ట్రాటజీ` అంటే ఏంటో తెలుసా? సరళంగా చెప్పాలంటే.. మన టాలీవుడ్‌లో ఉండే పీఆర్వో (ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్) వ్యవస్థే! సౌత్‌లో ప్రతి సినిమాకు, హీరోకు పీఆర్వోలు ఉంటూ ప్రచారం.. మీడియా వ్యవహారాలు చూసుకుంటారు. అయితే బాలీవుడ్ తన కార్పొరేట్ శైలికి తగ్గట్టుగా అదే పీఆర్వో పదవికి `హెడ్ ఆఫ్ క్యూనికేషన్స్` అని కాస్త క్లాస్‌గా, కార్పొరేట్ లుక్ ఇచ్చేలా పేరు మార్చి పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హెడ్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ స్ట్రాట‌జీలో ప్ర‌తిభావంతుల‌ను లాక్ చేయ‌డం, దీర్ఘ కాలిక లాభాలు- ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం అనే గ‌మ్మ‌త్త‌యిన ఫార్ములా దాగి ఉంది. అదే స్థాయిలో ఇలాంటి వ్య‌వ‌హారాల్లో వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ల‌ను అదుపులో ఉంచ‌డం.. కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం.. ప్రొడ‌క్ష‌న్‌లో అవినీతిని నిరోధించ‌డం..కూడా ఈ హెడ్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ కి అద‌న‌పు బాధ్య‌త‌లుగా ఉండాలి.

నిజానికి వినోద‌ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన‌ది బాసిజం లేదా కంట్రోల్ కాదు క్రియేటివిటీ మాత్ర‌మే. అది కూడా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న కాన్సెప్టుల‌ను వెతికి ప్రోత్స‌హించ‌డం అవ‌స‌రం. మొత్తానికి టాలీవుడ్ తన గ్రౌండెడ్ నేచర్.. క్రియేటివిటీతో పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా పదవులు, కార్పొరేట్ హోదాలు, బాస్ కల్చర్ చుట్టూనే తిరుగుతోందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. కథను నమ్ముకోకుండా కేవలం కార్పొరేట్ వ్యూహాలతోనే బాలీవుడ్ మళ్లీ పూర్వవైభవాన్ని సాధించగలదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News