కథ నచ్చితే చిన్న పాత్రలైనా చేస్తా
ఈ సినిమాలో లయ పోషిస్తున్న పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని విధంగా, హీరోని డామినేట్ చేసే స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు ఆమె తెలిపారు.;
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి తెరపై కలవబోతున్నారు శివాజీ మరియు లయ. ఒకప్పుడు హిట్ జంటగా ప్రేక్షకులను అలరించిన ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, కమ్‌బ్యాక్‌తో పాటు నోస్టాల్జియా ఫీలింగ్‌ను కూడా రేకెత్తిస్తోంది. శివాజీ, లయ జంటగా సినిమా చేసి 20 ఏళ్లు పూర్తవుతున్న ఈ సందర్భంలో, ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే ఆసక్తి పెరిగింది.
ఫ్యామిలీ స్టోరీ కాదు..
అయితే ఈ సినిమాను మొదట్లో ఫ్యామిలీ డ్రామాగా భావించినట్లు లయ వెల్లడించారు. కానీ కథ విన్నాక ఇది నార్మల్ ఫ్యామిలీ స్టోరీ కాదని, పక్కా ఎంటర్‌టైనర్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిగిన సినిమా అని ఆమె స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్‌ను ఆకట్టుకునేలా కథలో అనూహ్య మలుపులు ఉంటాయని చెబుతున్నారు. డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ ప్రతి పాత్రను కథకు అవసరమైనంత మేరకు తీర్చిదిద్దారని, ఎక్కడా అతిశయోక్తి లేకుండా నడిపించారని లయ ప్రశంసించారు.
సినిమాలో ఏడిపించే సీన్స్ ఉన్నాయి.
ఈ సినిమాలో లయ పోషిస్తున్న పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని విధంగా, హీరోని డామినేట్ చేసే స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు ఆమె తెలిపారు. తనది మంగపతి లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసిన హీరోని సవాలు చేసే పాత్ర అని, శివాజీతో కలిసి చేసిన సీన్స్ మంచి వినోదాన్ని అందిస్తాయని, అలాగే ఈ సినిమాలో అందరినీ ఏడిపించే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని లయ పేర్కొన్నారు. సాఫ్ట్‌గా కనిపించినా, అవసరమైతే స్ట్రాంగ్ గా మాట్లాడే మహిళా పాత్రగా తన పాత్రను వర్ణించారు.
ఓటీటీ కోసం తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం టీమ్‌కు మరింత ఆనందాన్ని కలిగించిందని లయ చెప్పారు. ఈ సినిమాను ఈటీవీ విన్ తో కలిసి బన్నీ వాస్, వంశీ నందిపాటి మార్చి 6న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లయ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. కథ, క్యారెక్టర్ నచ్చితే చిన్న పాత్రలు చేయడానికైనా తాను రెడీ అని, ప్రస్తుతం జగపతిబాబుతో వదల అనే సినిమా చేస్తున్నాని, ఆ సినిమాలో నటిగా తనలోని మరో యాంగిల్ ను చూస్తారని లయ చెప్పారు. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ తో మరో సినిమా చేస్తున్నట్టు కూడా లయ వెల్లడించారు.