చరణ్ మాస్ పవర్.. సౌత్ ఇండియాలో తిరుగులేని నెంబర్ వన్ హిట్!

రికార్డుల విషయానికి వస్తే, ‘రై రై రా రా’ కేవలం 24 గంటల్లోనే సౌత్ ఇండియా లెవల్‌లో ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది.;

Update: 2026-03-03 18:07 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చేస్తున్న ప్రాజెక్టులపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమా కంప్లీట్ మాస్ అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే మెగా ఫ్యాన్స్‌లో ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో చరణ్ లుక్ మేకోవర్ అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉన్నాయి.

ఇక ప్రమోషన్ల విషయంలో మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'చికిరీ చికిరి' చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ గ్రేస్ డ్యాన్స్ ఆ పాటలో హైలైట్‌గా నిలవడంతో, రెండో సాంగ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే లేటెస్ట్ గా వచ్చిన రెండో సింగిల్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

 

లేటెస్ట్ గా విడుదలైన ‘రై రై రా రా’ సాంగ్ విడుదలైన మొదటి గంట నుంచే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఏఆర్ రెహమాన్ తనదైన స్టైల్‌లో అదిరిపోయే మాస్ బీట్ ఇవ్వడమే కాకుండా, స్వయంగా పాడటం ఈ పాటకు పెద్ద ప్లస్ పాయింట్. అనంత శ్రీరామ్ రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ కథలోని ఇంటెన్సిటీని చూపిస్తున్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రికార్డుల విషయానికి వస్తే, ‘రై రై రా రా’ కేవలం 24 గంటల్లోనే సౌత్ ఇండియా లెవల్‌లో ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఐదు భాషల్లో కలిపి ఈ పాట ఏకంగా 46.1 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే 29.21 మిలియన్ల వ్యూస్ రాబట్టి, అంతకుముందు 'చికిరీ చికిరి' పేరిట ఉన్న 29.1 మిలియన్ల రికార్డును ఇది దాటేసింది. మ్యూజిక్ చార్ట్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ తన సత్తా చాటుతోంది.

కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా 8 లక్షలకు పైగా లైక్స్ కూడా ఈ పాటకు రావడం విశేషం. టాలీవుడ్‌లో గతంలో ఉన్న టాప్ వ్యూవ్ గ్లింప్స్, సాంగ్స్ రికార్డులన్నీ ఇప్పుడు ‘పెద్ది’ ఖాతాలో చేరిపోయాయి. చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కు తోడు రెహమాన్ మ్యాజిక్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఒక మ్యూజికల్ సెన్సేషన్ గా మారింది. బుచ్చిబాబు తన సిగ్నేచర్ స్టైల్ లో విజువల్స్ ను చాలా రిచ్ గా ప్రెజెంట్ చేశారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రికార్డుల హవా చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద చరణ్ మరోసారి తన పవర్‌ను చూపిస్తాడాని క్లియర్ గా అర్ధమవుతుంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఎలాంటి రికార్డ్ లు క్రియేట్ అవుతాయో చూడాలి.

Full View
Tags:    

Similar News