ఓదెల.. ఈ ఒక్కటి దాటితే చాలు..

శ్రీకాంత్ ఓదెలకు దర్శకుడిగా తొలి అవకాశం నానితోనే వచ్చింది. దసరా సినిమాతో ఆయన టాలీవుడ్‌ కు పరిచయమయ్యారు.

Update: 2026-09-22 11:58 GMT

ఒక్క సినిమా హిట్ అయితే దర్శకుడికి గుర్తింపు వస్తుంది.. అదే డైరెక్టర్ కు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు వస్తే అసలు టైం మొదలైనట్టే. ఇప్పుడు టాలీవుడ్‌ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పరిస్థితి చూస్తే ఇదే మాట గుర్తొస్తోంది. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నానితో మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. దీంతో శ్రీకాంత్ ఓదెల కెరీర్‌ పై ఆసక్తి మరింత పెరిగింది.

శ్రీకాంత్ ఓదెలకు దర్శకుడిగా తొలి అవకాశం నానితోనే వచ్చింది. దసరా సినిమాతో ఆయన టాలీవుడ్‌ కు పరిచయమయ్యారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకుని, పక్కా మాస్ ట్రీట్మెంట్‌ తో తెరకెక్కించిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే శ్రీకాంత్ తనదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా కథను చెప్పే విధానం, పాత్రలను చూపించిన తీరు, మాస్ ఎలివేషన్స్ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

అయితే తొలి సినిమా విజయంతో ఆగిపోకుండా.. ఇప్పుడు మరోసారి నానితోనే ది ప్యారడైజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 24న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి శ్రీకాంత్ ఓదెల ఎంచుకున్న స్టోరీ వరల్డ్ దసరాతో పోలిస్తే పూర్తిగా మరో స్థాయిలో ఉండబోతుందనే సిగ్నల్స్ ప్రమోషనల్ కంటెంట్‌ తోనే వచ్చాయి. ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాకపోయినా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ట్రైలర్ కూడా రాకముందే ఈ రేంజ్ లాల్ హైప్ రావడం ది ప్యారడైజ్ పై ఉన్న అంచనాలకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందనే దానికంటే.. శ్రీకాంత్ తన తొలి సినిమాను మించి ఏం చూపించబోతున్నారనే ఆసక్తి కూడా కనిపిస్తోంది. ఇక ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెలకు దక్కిన ఛాన్స్ మరింత పెద్దది. ఆయన మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నారు. అంటే ఒక దర్శకుడి కెరీర్‌ లో వరుసగా వస్తున్న మూడు సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లే.

తొలి మూవీలో నాని.. రెండో సినిమాలో కూడా నాని.. మూడో సినిమాకు చిరంజీవి. ఆ జర్నీ చూస్తే శ్రీకాంత్ ఓదెలపై ఏర్పడిన నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్యారడైజ్ రిజల్ట్ మెయిన్. ఇప్పటికే దసరాతో తన సత్తా చూపించిన శ్రీకాంత్.. ఇప్పుడు నానితో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలి. ఆ సినిమా కూడా విజయం సాధిస్తే చిరంజీవితో చేయబోయే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.

అదే సమయంలో చిరంజీవి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే శ్రీకాంత్ ఓదెలకు మరిన్ని భారీ అవకాశాలు రావడానికి ఈజీ అవుతుంది. ఒక దర్శకుడికి తొలి సినిమాతో గుర్తింపు రావడం ఒక విషయం. ఆ గుర్తింపును నిలబెట్టుకుని వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేయడం మరో విషయం. రెండు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో వర్కౌట్ అయితే మాత్రం శ్రీకాంత్ ఓదెలకు టాలీవుడ్‌ లో మరింత పెద్ద అవకాశాలు తలుపుతట్టే రోజులు వస్తాయి.

Tags:    

Similar News