అన్ని సినిమా కథల్లో వెళ్లు పెడతా!
నవీన్ పొలిశెట్టి చిత్ర రంగంలో ఎలా ఎదిగాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇంతింతై వటుడింతైన చందంగా ఎదిగాడు.;
నవీన్ పొలిశెట్టి చిత్ర రంగంలో ఎలా ఎదిగాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇంతింతై వటుడింతైన చందంగా ఎదిగాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా ప్రమోట్ అయిన మరో ప్రతిభా వంతుడు. నేరుగా బాలీవుడ్ నే టార్గెట్ చేసి అక్కడే స్థిరపడాలనుకున్నాడు. అక్కడ ఎన్నో ప్రయ త్నాలు చేసి చివరికి సొంత పరిశ్రమ టాలీవుడ్ కి చేరుకున్నాడు. ఇక్కడా అవకాశాలు కోసం కాళ్లు అరిగిలే తిరిగాడు. కానీ కష్టే ఫలి అని నమ్మి పని చేసాడు. దీంతో `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయ మవ్వడం.. అక్కడ నుంచి నవీన్ హీరోగా ఎదిగిన సన్నివేశం తెలిసిందే.
ఈ ప్రోసస్ లో తనని తానే స్టార్ గా మలుచుకున్నాడు అన్నది అంతే వాస్తవం. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా రైటింగ్ విభాగంలోనూ తన మార్క్ పడేలా చూసుకున్నాడు. నవీన్ హీరోగా నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' స్రీన్ ప్లే లో భాగమయ్యాడు. స్వరూప్ ఆర్ .ఎస్. జె దర్శకత్వం వహించిన బ్యాకెండ్ లో నవీన్ చాలా గ్రౌండ్ వర్క్ చేసాడు. 4 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన 'జాతిరత్నాలు' తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అనుదీప్ దర్శకత్వం వహించిన రైటింగ్ లో తన హస్తం కూడా ఉందని నవీన్ తాజా ప్రకటనతో అర్దమవుతుంది.
6 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా 70 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తోనూ యావరేజ్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో అనుష్క పక్కన నటించే అరుదైన అవకాశం దక్కింది. ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన 'అనగనగనగా ఒక రాజు'తోనూ మంచి విజయం అందుకున్నాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' తర్వాత ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఈ సినిమా స్టోరీ విభాగంలోనూ నవీన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే తాను ఏ సినిమా చేసినా ఆ కథల్లో వేళ్ళు పెడతానంటూ పబ్లిక్ గానే ప్రకటించాడు.
సాధారణంగా నటులు రైటింగ్ విభాగంలో ఇన్వాల్వ్ అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తుతాయి. సినిమా సక్సెస్ కి కూడా తక్కువ అవకాశాలుంటాయనే ఆరోపణ లున్నాయి. కానీ నవీన్ ఇన్వాల్స్ అయిన ప్రతీ సినిమా మంచి విజయం సాధించిందే. ఇంత వరకూ ఏ సినిమా వైఫల్యం చెందలేదు. రిలీజ్ లు ఆలస్య మైనా? పక్కా కాన్పిడెంట్ సబ్జెక్ట్ తోనే నవీన్ అండ్ కో బరిలోకి దిగి హిట్ కొడుతుంది.