నిర్మాతను భలే ఇరికించేసిన మహేష్..
కొందరు హీరోలు స్క్రీన్ పై కనిపించే దానికీ, బయట ఉండే దానికి చాలా భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.;
కొందరు హీరోలు స్క్రీన్ పై కనిపించే దానికీ, బయట ఉండే దానికి చాలా భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ ఆఫ్ స్క్రీన్ చాలా రిజర్డ్వ్ గా కనిపిస్తారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. కానీ ఒక్కసారి ఆయన మాట్లాడారంటే ఆ సెన్సాఫ్ హ్యూమర్ ను తట్టుకోవడం చాలా కష్టమని ఆయనతో పాటూ కలిసి ట్రావెల్ చేసిన ఎంతో మంది చెప్తుంటారు.
సూపర్ హిట్ గా నిలిచిన ఒక్కడు
ఇప్పటికే పలువురు మహేష్ గురించి, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గురించి, సెట్స్ లో మహేష్ చేసే అల్లరి గురించి చెప్పగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్- గుణశేఖర్ కాంబినేషన్ లో అర్జున్, ఒక్కడు, సైనికుడు అనే మూడు సినిమాలు రాగా వీటిలో ఒక్కడు సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది.
ఆ ఫోన్ నెంబర్ నిర్మాతదే
ఆ సినిమాలో అందరికీ గుర్తుండే కామెడీ ట్రాక్స్ లో ధర్మవరపు ఫోన్ సీన్ ఒకటి. కొత్తగా ఫోన్ కొన్న ధర్మవరపు చెప్పిన ఫోన్ నెంబర్ కు ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ తెగ ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే సీన్ అది. అయితే ఆ సీన్ లో ధర్మవరపు చెప్పే ఫోన్ నెంబర్ సినిమా నిర్మాత ఎంఎస్ రాజుదేనట. సినిమాలో ఆయన నెంబర్ వాడాలనే ఐడియా ఇచ్చింది మరెవరో కాదని, స్వయంగా హీరో మహేష్ బాబే చెప్పారని గుణశేఖర్ తెలిపారు.
అలా రెగ్యులర్ గా మనం వాడే నెంబర్ ఇస్తే తర్వాత ఆయనకు ప్రాబ్లమ్ అవుతుందని గుణశేఖర్ ఎంత చెప్పినా వినకుండా మహేష్ అప్పుడు చూసుకుందాంలే కానివ్వండంటూ ఆ నెంబరునే పెట్టించేశాడని, సినిమా రిలీజయ్యాక ఎం.ఎస్ రాజుకు మహేష్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన కాల్స్ వచ్చాయని, ఆ సినిమా హిట్ అవడంతో ఎం.ఎస్ రాజు కూడా ఆ విషయాన్ని ఎంజాయ్ చేశారని గుణశేఖర్ వెల్లడించారు. సైలెంట్ గా కనిపించే మహేష్ లో ఈ అల్లరితనం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.