టైర్ టు హీరో ఇకపై పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటాడా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కెరీర్ సాఫీగా సాగుతుంటే దాన్ని వక్రమార్గంలోకి నెట్టుకోవడం అనేది స్వయంకృతాపరాదం అవుతుంది.;
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కెరీర్ సాఫీగా సాగుతుంటే దాన్ని వక్రమార్గంలోకి నెట్టుకోవడం అనేది స్వయంకృతాపరాదం అవుతుంది. ఇలాంటి పని చేసి తమ కెరీర్‌లని రిస్క్‌లోకి నెట్టిన హీరోలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ స్టోరీస్ తమని వెతుక్కుంటూ వచ్చినా వాటిని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పక్కన పెట్టి ఏరి కోరి ఫ్లాప్‌లు, డిజాస్టర్లు చేసిన వారు ఉన్నారు. కొత్త కథలు వెతుక్కుంటూ వచ్చినా వాటిలో లేనిపోని మార్పులు చేసి ఆ కథలు తెరపైకి రాకుండా చేసిన ఘనులూ ఉన్నారు.
అలాంటి వాళ్లలో ఓ టైర్ 2 హీరో ముందు వరుసలో నిలుస్తున్నాడు. ఫస్ట్ మూవీని వి.వి.వినాయక్‌తో, సెకండ్ ఫిల్మ్‌ని తేజతో చేసి బ్లాక్ బస్టర్‌లని అందుకున్న సదరు హీరో ఆ తరువాత హిట్టు మాట వినడానికి పదేళ్లు పట్టింది. ఆ తరువాత కూడా బిగ్ హిట్‌ని ఖాతాలో వేసుకున్నా దాన్ని అదే స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఒక్క హిట్టు వస్తే తరువాత వరుసగా మూడు ఫ్లాపులతో సాగడం అతనికి అలవాటుగా మారింది. ఈసారి ఏకంగా ఐదు ఫ్లాపుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండేళ్లు కష్టపడి చేసినా బడ్జెట్, డైరెక్టర్ తడబాటు కారణంగా సదరు హీరో భారీ మూల్యం చెల్లించక తప్ప లేదు.
ఈ ఏడాది కెరీర్ బిగ్ బడ్జెట్ రూ.75 కోట్లు పెట్టి చేసినా అది కూడా పెద్దగా ప్రభావం చూపకపోగా భారీ డిజాస్టర్ అనిపించుకుని షాక్ ఇచ్చింది. హీరోగా కెరీర్ ప్రారంభించి 23 ఏళ్లకు పైనే అవుతున్నా ఇప్పటికీ సదరు హీరో పరిస్థితి ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే ఉన్నాడన్నట్టుగా తయారైంది. తనతో, తన తరువాత.. కెరీర్ ప్రారంభించిన హీరోలంతా పాన్ ఇండియా స్టార్‌లుగా మారి స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుంటే భారీ ప్రొడక్షన్ కంపనీల సపోర్ట్ ఉండి కూడా హీరోగా స్టార్‌డమ్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు.
కెరీర్ ప్రారంభించి 23 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ కమర్షియల్ హీరోగా నిలబడలేకపోతున్నాడు. స్వయం తప్పిదాలతో డైరెక్టర్లని ఇబ్బందులకు గురి చేసిన సదరు హీరో ఇప్పుడు వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ కెరీర్‌లో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. గత ఐదేళ్లుగా ఐదు డిజాస్టర్లని ఎదుర్కొని రేసులో వెనకబడిపోయాడు. తనకు బ్లాక్ బస్టర్ ఇస్తానని ప్రామిస్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ కూడా హిట్టివ్వకపోవడంతో షాక్‌కు గురైన సదరు టైర్ 2 స్టార్ 2026 అయినా తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
పదేళ్లు వరుస ఫ్లాపుల అనంతరం తనకు సూపర్ హిట్ మూవీని అందించిన దర్శకుడితో త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు. రీసెంట్ ఫ్లాపుల కారణంగా స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేశారట. పవర్ ఫుల్ గా సాగుతూనే ఎమోషన్స్‌కి పెద్ద పీట వేసినట్టుగా తెలుస్తోంది. భారీ స్పాన్ ఉన్న స్టోరీ కావడంతో దీన్ని పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని, ఏ విషయంలోనూ రాజీపడకుండా దీన్ని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ మూవీని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసి భారీ బ్లాక్ బస్టర్‌తో బౌన్స్ బ్యాక్ కావాలని సదరు హీరో చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.