బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులతో కాకపుట్టిస్తోన్న శ్రీలీల!
తెలుగు హీరోయిన్ శ్రీలీల తెలివైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. టాలీవుడ్ సినిమాల్లో ఐటం పాటల్లో కొనసాగితే కెరీర్ ఎలా ఉంటుంది? అన్నది అమ్మడు ముందే గుర్తించి అలెర్ట్ అయింది.;
తెలుగు హీరోయిన్ శ్రీలీల తెలివైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. టాలీవుడ్ సినిమాల్లో ఐటం పాటల్లో కొనసాగితే కెరీర్ ఎలా ఉంటుంది? అన్నది అమ్మడు ముందే గుర్తించి అలెర్ట్ అయింది. దీంతో హీరోయిన్ గా వచ్చిన అవకా శాలు సైతం వదులుకోవడానికి ఎంత మాత్రం వెనకడుగు వేయలేదు. హీరోయిన్ ఛాన్స్ ఎరతో? ఐటం పాటలోనూ లాక్ చేసే ప్రయత్నాలు కొందరు చేసే సరికి వారి అతి తెలివిని పసిగట్టి మొత్తం ప్రాజెక్ట్ నే వదులుకుంది. ఈ విష యంలో అమ్మడు ఎంతో తెలివిగా ఎస్కేప్ అయింది. అప్పటి నుంచి తెలుగు అవకాశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉంటుంది.
కొత్త అవకాశాలతో ఎవరు వచ్చినా? ఆచి తూచి మాట్లాడుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు మామ్ సలహా కూడా తీసుకుని ముందుకెళ్తుంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగు సినిమాల కంటే హిందీ, తమిళ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో సంచలన మ్యూజికల్ లవ్ స్టోరీ ఆషీకీ 3 లో నటిస్తోంది. ఇందులో అమ్మడు కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలున్నా? అమ్మడు ఎంత మాత్రం రాజీ పడలేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తాను పూర్తిగా దర్శకుల హీరోయిన్ అని ప్రూవ్ చేయబోతుంది.
ఈ సినిమా విజయం సాధిస్తే గనుక శ్రీలీల బాలీవుడ్ కెరీర్ మారిపోతుంది. ఒక్క విజయంతోనే అమ్మడు తారా స్థాయికి చేరిపోతుంది. శ్రద్దాకపూర్ బాలీవుడ్ ఈ సినిమా సీక్వెల్ తోనే సంచలన నటిగా మారింది. మరి శ్రీలీల అంతటి అదృష్టవంతురాలు అవుతుందా? లేదా? అన్నది చూడాలి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కార్తీక్ఆర్యన్- శ్రీలీల మంచి డాన్సర్లు. మ్యూజికల్ లవ్ స్టోరీ కావడంతో వాళ్లలో డాన్సింగ్ స్కిల్స్ ను కూడా దర్శకుడు అనురాగ్ బసు సద్వినియోగం చేసుకోగల్గితే సినిమాకు అదనంగా కలిసొస్తుంది.
ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఇదే కాంబినేషన్ తో మరో డైరెక్టర్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ సినిమాకు `ఫీటమ్ పురా` అనే టైటిల్ కూడా పెట్టినట్లు ప్రచారంలో ఉంది. ఇదొక భారీ యాక్షన్ థ్రిల్లర్ అని వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే శ్రీలీల నెట్టింట సంచలనం అవుతుంది. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా లో ఛాన్స్ అంటే? ఆ వైబ్ వేరే లెవల్లో ఉంటుంది. తాజాతా కోలీవుడ్ స్టార్ ధనుష్ 55వ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది.
కెరీర్ ఆరంభంలోనే ధనుష్ తో నటించే ఛాన్స్ రావడం అంటే? ఎంతో లక్కీ గాళ్ అనే చెప్పాలి. దనుష్ కోసం ఎంతో మంది భామలు క్యూలో ఉంటే వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ తెలుగు నటి ఛాన్స్ అందుకుంది. త్వరలో `ఉస్తాద్ భగత్ సింగ్` తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించింది. ఈ సినిమా హిట్ అయితే గనుక శ్రీలీల పేరు టాలీవుడ్ లో మరోసారి మారుమ్రోగిపోతుంది.