పెద్ది: నెక్స్ట్ లెవల్ ఛాలెంజ్ కోసం చరణ్ రెడీ.. పవర్ఫుల్ కటౌట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాను బుచ్చిబాబు సాన పక్కా విజువల్ స్పెక్టాకిల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఒక సరికొత్త స్క్రిప్ట్‌తో వస్తుండటంతో చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక రీసెంట్‌గా సంక్రాంతి పండుగ కావడంతో చరణ్ షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి హాయిగా పండుగ జరుపుకున్న మెగా హీరో, హాలిడే మూడ్ ముగియగానే మళ్ళీ పనిలోకి దిగిపోయారు. షూటింగ్‌లో రాబోయే టఫ్ షెడ్యూల్ కోసం తనను తాను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
లేటెస్ట్ గా తన జిమ్ నుండి కొన్ని క్రేజీ ఫోటోలను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన బాడీని పర్ఫెక్ట్‌గా ట్యూన్ చేస్తూ, షూటింగ్‌లో ఉండబోయే ఫైనల్ రౌండ్ కోసం తాను ఫిట్‌గా ఉన్నట్లు ఈ ఫోటోల ద్వారా హింట్ ఇచ్చారు. 'పెద్ది' కోసం చరణ్ తన లుక్ ను కంప్లీట్ గా మార్చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే, ఈ సినిమాలోని పాటలు వరల్డ్ వైడ్ గా సౌండ్ చేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన 'చికీరి చికీరి' సాంగ్ కి సాలీడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇన్ స్టా రీల్స్ లో కూడా ఈ సాంగ్ ని తెగ వాడేస్తుండటంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాస్ట్ లెగ్ లోకి ఎంటర్ అయింది. మేకర్స్ అనుకున్న ప్లాన్ ప్రకారం మార్చి 27న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి బిగ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపు ఎండింగ్‌కి రావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ అవుట్‌పుట్ మీదే ఉంది.
సంక్రాంతి పండుగ ఎంజాయ్ మెంట్ అయిపోగానే, బాస్ చిరంజీవి సక్సెస్ మీట్ తో జోష్ నింపితే, ఇప్పుడు చరణ్ తన ఫిజిక్ తో ఫ్యాన్స్ కి కొత్త కిక్ ఇచ్చారు. మొత్తానికి పెద్ది సినిమాతో బాక్సాఫీస్ వద్ద చరణ్ మరోసారి తన పవర్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. ఇక సినిమా మార్కెట్ లో ఏ స్థాయిలో బిజినెస్ చేస్తుందో చూడాలి.