#RRR: కొత్త టెక్నాలజీ వాడుతున్న జక్కన్న

Update: 2019-01-21 11:11 GMT
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR సెకండ్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభం అయింది.  ఈ విషయాన్ని వెల్లడిస్తూ #RRR టీమ్ కొన్ని ఫోటోలు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసూ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.  ఈ సినిమాకోసం ఇండియాలోనే మొదటిసారిగా ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట.

ఇదే విషయాన్ని #RRR ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.  ఈ సినిమా చిత్రీకరణకు అలెక్సా ఎల్ఎఫ్ కెమెరా.. ఎఆర్ ఆర్ ఐ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ ను వాడుతున్నామని.. భారతదేశంలో ఈ టెక్నాలజీ వాడుతున్న సినిమాలలో ఈ సినిమా మొదటిదని అయన ట్వీట్ చేశారు.  సినిమా షూటింగ్ లో ఆర్టిఫిషియల్ లైటింగ్ ను వాడాల్సి ఉంటుంది. కానీఈ లెన్స్ వాడకంతో ఆర్టిఫిషియల్ లైట్ వాడకాన్ని తగ్గించి ఎక్కువ భాగం సహజ కాంతితోనే ఉండేలా చేయవచ్చని సమాచారం.  దీంతో అవుట్ పుట్ కూడా చాలా సహజంగా ఉంటుందట.
 
టెక్నాలజిని సమర్థంగా వాడుకోవడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. 'బాహుబలి'తో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ ను ప్రేక్షకులకు చూపించిన రాజమౌళి ఇప్పుడు #RRR చిత్రీకరణలో ఉపయోగిస్తున్న టెక్నాలజీతో ప్రేక్షకులను మరోసారి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మనం ఒక ఏడాది పాటు వేచి చూడక తప్పదు. 


Full View
Tags:    

Similar News