హ్యాట్రిక్ కాంబినేషన్ అలా మొదలైంది

Update: 2016-03-10 15:30 GMT
అలా మొదలైంది.. విభిన్నమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి కొత్తతరహా కథ - కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. అలా మొదలైందితో టాలీవుడ్ కి దర్శకురాలిగా పరిచయం అయిన నందినీరెడ్డి.. ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ అయిపోయింది. ఈ చిన్న సినిమా కమర్షియల్ గా బిగ్ సక్సెస్ సాధించడం విశేషం. రంజిత్ మూవీస్ బ్యానర్ పై కె.ఎల్.దామోదర్ రెడ్డి అలా మొదలైంది చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు మరోసారి ఇదే ప్రొడ్యూసర్ - డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన కళ్యాణ వైభోగమే కూడా సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతుండడం విశేషం.

దీంతో నందినీ రెడ్డితో తమ కాంబినేషన్ సూపర్ అంటున్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ఒకే కాంబినేషన్ తో వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించడం చిన్న విషయం కాదని చెప్పారు. త్వరలో నందినీరెడ్డితో మరో చిత్రాన్ని చేయబోతున్నామని.. ఈ చిత్రంతో కూడా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమాగా చెప్పారాయన. 'మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకరకంగానే ఉంటుంది. అందుకే దామోదర్ గారితో వర్క్ చేసేటపుడు ఎలాంటి ప్రెజర్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. మా కాంబినేషన్ లో ఖచ్చితంగా హ్యాట్రిక్ మూవీ వస్తుంది' అని చెప్పారు నందినీ రెడ్డి.

జబర్దస్త్ ఫ్లాప్ తో నందినీ రెడ్డి ద్వితీయ విఘ్నం దాటలేకపోయిందని, ఇక ఈమె సంగతి అయిపోయినట్లే అనే కామెంట్లకు.. కళ్యాణ వైభోగమే తో సమాధానం ఇచ్చింది ఈ లేడీ డైరెక్టర్.

Tags:    

Similar News