ఆ సినిమా చేయడం కోసం నాగ్ చాలా ఆసక్తిగా ఉన్నాడట
కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రదర్శణ కనబర్చలేదు. కాని విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నాగార్జునకు మరోసారి ప్రశంసలు దక్కేలా చేసింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా వైల్డ్ డాగ్ ఆకట్టుకోలేక పోయిందనేది కొందరి అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే నాగార్జున తదుపరి సినిమా జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న సినిమాపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు చాలా నమ్మకంగా ఉన్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ 11త్ అవర్ వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్బంగా నాగార్జునతో చేయబోతున్న సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ప్రవీణ్ సత్తారు తన సినిమాలో నాగార్జునను ఒక రా ఏజెంట్ గా చూపించబోతున్నాడు. ఈ సినిమాలో పాత్రకు నాగార్జున గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. పాత్ర తీరు భలే ఉందని ఆయన అభినందించాడు. ఈ సినిమాలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్ తో పాటు పలు రకాల యాక్షన్ స్టంట్స్ ను కూడా నాగార్జున చేయబోతున్నారు. ఇందుకోసం బ్యాంకాక్ నుండి ప్రత్యేకంగా ట్రైనింగ్ కోసం మాస్టర్ లను తీసుకు వచ్చినట్లుగా ప్రవీణ్ సత్తార్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా హైదరాబాద్ మరియు గోవాలతో పాటు ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో చిత్రీకరింబచోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
నాగార్జున ఈ పాత్ర విషయంలో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ను కలిగి ఉన్న కారణంగా తనపై మరింత భారం పెరిగిందని అన్నాడు. ఇక ఈ సినిమాలో కాజల్ నటించబోతుంది. ఆమె కూడా రా ఏజెంట్ గా కనిపించబోతుందట. ఒక రిటైర్డ్ ఆపీసర్ తన కుటుంబానికి వచ్చిన సమస్య ను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథాంశంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది సినిమా వచ్చే వరకు తెలియదు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టి ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.