త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి రైట‌ర్ గానా?

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య ఇప్ప‌టికే సొంతంగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-02-18 10:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య ఇప్ప‌టికే సొంతంగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ భాగ‌స్వామ్యంలోనూ ఈ సంస్థ వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తోంది. నిర్మాణ కంటే క్రియేటివ్ విభాగంలోనే సాయి సౌజ‌న్య ఎక్కువ‌గా ఇన్వాల్వ్ అవుతుంటారు. స్టోరీ ఒకే చేసే ముందు క్రియేటివ్ స్పేస్ లో కూర్చుంటారు. నిశితంగా క‌థ‌ను ప‌రిశీలిస్తారు.

ఆ క‌థ‌కు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు అందిస్తుంటారు. మార్పులు ఏవైనా చేయాలంటే నిర్మొహ మాటంగా త‌న అభిప్రాయాన్ని ద‌ర్శ‌కుడితో పంచుకుంటారు.

వెండి తెర‌పై సాయి సౌజ‌న్య పేరు నిర్మాత‌గా ప‌డినా? స్టోరీ, స్క్రీన్ ప్లే లో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఎంత‌గానో ఉంటుంది. బేసిక్ గా సాయి సౌజ‌న్య శాస్త్రీయ నృత్య క‌ళాకారాణి. ప‌లు వేదిక‌ల‌పై ఎన్నో షోస్ చేసారు. రాష్ట్ర స్థాయిలో అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఈ విష‌యంలో భ‌ర్త స‌హ‌కారం కూడా ల‌భించింది. ఆమెలో ఫ్యాష‌న్ గుర్తించే త్రివిక్ర‌మ్ నిర్మాణ రంగంలోకి తీసుకొచ్చారు. అయితే తాజాగా సాయి సౌజ‌న్య సైతం క‌లం ప‌డుతున్నార‌నే వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఆమె సొంతంగా ఓ స్టోరీ సిద్దం చేస్తున్నారుట‌. అందులో హీరోగా మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలిసింది.

త్రివిక్ర‌మ్..వైష్ణ‌వ్ తో చ‌ర్చించి స్టోరీ లైన్ విష‌యంలో ఇద్ద‌రు పాజిటివ్ గా స్పందించ‌డంతో పూర్తి క‌థ సిద్దం చేయ‌మ‌ని గురూజీ సూచించారుట‌. క్రియేటివ్ విభాగంలో ప‌నిచేసిన అనుభ‌వంతో ఆమె కూడా ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది. భ‌ర్త గొప్ప ద‌ర్శ‌కుడు కం ర‌చ‌యిత‌. సాయి సౌజ‌న్య ఎలాంటి క‌థ రాసినా? అందులో త‌ప్పొప్పుల‌ను క‌రెక్ట్ చేస్తారు. ఆర‌కంగా ఎలాంటి ఇబ్బంది లేదు. `ఆదికేశ‌వ` త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ మ‌రో సినిమా క‌మిట్ అవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. న‌చ్చిన స్టోరీలు రాక‌పోవ‌డంతో ఖాళీగా ఉంటున్నాడు. ఈ మూడేళ్ల కాలంలో చాలా క‌థ‌లే విన్నాడు.

కానీ కంగారు ప‌డి క‌మిట్ అవ్వ‌డం కంటే మంచి సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌తో నిర్ణ‌యం తీసుకోలేదు. తాజాగా సాయి సౌజ‌న్య వినిపించిన లైన్ విష‌యంలో పాజిటివ్ గా ఉండ‌టంతో? మూవ్ అవుతున్నాడు. మ‌రి ఈ క‌థ‌ను సాయి సౌజ‌న్య డైరెక్ట్ చేస్తారా? అంటే నో అనే వినిపిస్తోంది. కేవ‌లం స్టోరీ అందించ‌డం వ‌ర‌కే ఆమె ప‌రిమితం అవుతారుట‌. అటుపై ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు మ‌రొక‌రికి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని మాత్రం సొంత నిర్మాణ సంస్థ‌లోనే నిర్మించాల‌ని ఆమె భావిస్తున్నారుట‌.

Tags:    

Similar News