టాక్సిక్ పై ఎన్నో వార్త‌లు.. క్లారిటీ ఇవ్వ‌ని మేక‌ర్స్

అస‌లే టాక్సిక్ మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ కూడా గ‌ట్టిగానే ఉండ‌బోతోంది. ఈ సినిమాతో పాటూ దురంధ‌ర్: ది రివెంజ్ కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది.;

Update: 2026-02-18 10:06 GMT

కన్నడ రాక్ స్టార్ య‌ష్ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా టాక్సిక్ మార్చి 19న‌ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్ట‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా గురించి రోజుకో ఊహాగానం నెట్టింట వినిపిస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా ఓ ప్ర‌ముఖ వెబ్‌సైట్‌లో టాక్సిక్ కు సంబంధించిన క‌థా సారాంశం ప్ర‌త్య‌క్ష‌మైంది. అందులో టాక్సిక్ మూవీ 1940 నుంచి 1970 వ‌ర‌కు గోవా నేప‌థ్యంగా సాగే పీరియ‌డ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని, హింస, భ‌యం, ద్రోహంతో నిర్మిత‌మైన ఒక క్రైమ్ సామ్రాజ్య ఎదుగుద‌ల చుట్టూ క‌థ తిరుగుతుంద‌ని పేర్కొన్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.

కీల‌క సీన్స్ కు రీషూట్

వాస్త‌వానికి టాక్సిక్ మూవీ ఎప్పుడో రిలీజ‌వాల్సింది కానీ షూటింగ్ మొత్తం పూర్తైన త‌ర్వాత మూవీలోని ఓ కీల‌క భాగాన్ని తిరిగి రీ షూట్ చేశార‌ని వార్త‌లొచ్చాయి. పైగా అవుట్‌పుట్ తో సంతృప్తి చెంద‌ని య‌ష్ స్వ‌యంగా కొన్ని సీన్స్ లో జోక్యం చేసుకుని మార్పులు చేయించ‌డంతో పాటూ, కొన్ని సీన్స్ కు గోస్ట్ డైరెక్ష‌న్ కూడా చేశార‌ని ఊహాగానాలు ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే వీటిలో ఏ వార్త పైనా ఎవ‌రూ రెస్పాండ్ అయింది లేదు.

విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న టాక్సిక్ టీజ‌ర్

మొన్నా మ‌ధ్య టాక్సిక్ నుంచి టీజ‌ర్ రిలీజైన‌ప్పుడు అందులోని కాన్సెప్ట్ విష‌యంలో అంద‌రూ ఆస‌క్తి చూపించిన‌ప్ప‌టికీ, టీజ‌ర్ ప్రెజెంటేష‌న్ విష‌యంలో మాత్రం టాక్సిక్ ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఆ టీజ‌ర్ పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను మ‌ర్చిపోయేలా చేయాలంటే వెంట‌నే టాక్సిక్ మేక‌ర్స్ మ‌రేదైనా వీడియో కంటెంట్ ను రిలీజ్ చేసి ఉండాల్సింది కానీ అది చేయ‌లేదు.

టాక్సిక్ కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న దురంధ‌ర్2

అస‌లే టాక్సిక్ మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ కూడా గ‌ట్టిగానే ఉండ‌బోతోంది. ఈ సినిమాతో పాటూ దురంధ‌ర్: ది రివెంజ్ కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. దురంధ‌ర్ మూవీ ఫ‌స్ట్ పార్ట్ భారీ స‌క్సెస్ ను అందుకోవ‌డంతో ఈ సీక్వెల్ పై మంచి అంచ‌నాలుండ‌టం స‌హజం. దానికి తోడు ఈ సినిమా ప్రాంతీయ భాష‌ల్లో కూడా రిలీజ్ కానుండటంతో టాక్సిక్ కు పోటీ మ‌రింత ఎక్కువ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో దురంధ‌ర్ పోటీని త‌ట్టుకోవాలంటే టాక్సిక్ మంచి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ను రిలీజ్ చేసి సినిమాకు ఉన్న బ‌జ్ ను విప‌రీతంగా పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

రిలీజ్ కు మ‌రో నెల రోజులు మాత్ర‌మే టైమ్ ఉండ‌టంతో ఇప్పుడైనా టాక్సిక్ చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్ చేసి, సినిమాలోని సాంగ్స్, ట్రైల‌ర్ ను ఆడియ‌న్స్ లోకి వీలైనంత ఎక్కువ‌గా తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయాలి. అప్పుడే టాక్సిక్ కు మంచి ఓపెనింగ్స్ ద‌క్కే అవ‌కాశ‌ముంటుంది. కియారా అద్వానీ, న‌య‌న‌తార, రుక్మిణి వ‌సంత్, తారా సుతారియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ మార్చి 10న రిలీజవుతుంద‌ని వార్త‌లొస్తున్నాయి కానీ ఇంకా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఏమైనా టాక్సిక్ టీమ్ క‌థ విష‌యంలోనూ, ట్రైల‌ర్ విష‌యంలోనూ, ప్ర‌మోష‌న్స్ విష‌యంలోనూ సైలెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తే ఇక క‌ష్టం. ఇప్ప‌టికైనా మేక‌ర్స్ ఈ విష‌యాల్లో క్లారిటీ ఇస్తే బావుంటుంది. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News