సీక్వెల్ టైటిల్‌కు రెండు కోట్లా?

టాలీవుడ్‌లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హ‌వా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో పాటు స‌మాంత‌రంగా సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీల హ‌డావిడి న‌డుస్తోంది.;

Update: 2026-02-18 10:06 GMT

టాలీవుడ్‌లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హ‌వా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో పాటు స‌మాంత‌రంగా సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీల హ‌డావిడి న‌డుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన క్రేజీ సినిమాల‌కు సీక్వెల్స్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఆడియ‌న్స్ కూడా ఈ త‌ర‌హా సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్స్, స్టార్స్ ఎక్కువ‌గా ఈ త‌ర‌హా సీక్వెల్స్‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాల నిర్మాణం ఊపందుకుంది.

ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు క్రేజీ సీక్వెల్స్ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్నాయి. మ‌రి కొన్ని సెట్స్ పైకి వెళ్ల‌బోతున్నాయి. గూఢ‌చారి 2, క‌ల్కి 2898ఏడీ 2, పుష్ప 3, స‌లార్ 2, కార్తికేయ 3, బింబిసార 2, `హ‌ను మాన్` సీక్వెల్ `జై హ‌నుమాన్‌` ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. ఈ సీక్వెల్ అన్నీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వ‌చ్చేస్తాయా... ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తాయా? అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడో సీక్వెల్ మూవీ టైటిల్ స్టోరీపై టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన మూవీ క్రేజీ సీక్వెల్ చేతులు మార‌డ‌టంతో టైటిల్‌కే మేక‌ర్స్ అక్ష‌రాలా రెండు కోట్లు చెల్లించాల్సి వ‌చ్చింద‌ట‌. దానికి కార‌ణం డైరెక్ట‌ర్‌కు, అంత‌కు ముందు సినిమా చేసిన నిర్మాత‌కు మ‌ధ్య ఏర్ప‌డిన ఆర్థికప‌ర‌మైన గొడ‌వ‌లే ప్ర‌ధాన కార‌ణం అని తెలుస్తోంది. స్మాల్ హీరోతో పాన్ ఇండియా స్టాయి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన డైరెక్ట‌ర్ దానికి సీక్వెల్‌గా భారీ స్థాయిలో ఓ మూవీని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే ఇక్క‌డే డ్యామిట్ క‌థ అడ్డం తిరిగింది. సీక్వెల్‌తో పాటు మ‌రో నాలుగు క్రేజీ సినిమాల‌ను ఇదే బ్యాన‌ర్‌లో చేస్తాన‌ని ప‌ది కోట్లు ద‌ర్శ‌కుడు అడ్వాన్స్ తీసుకున్నాడ‌ని, అయితే ఇప్పుడు ఆయా సినిమాల‌ని వేరే ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల‌కు క‌మిట్ అయ్యాడ‌ని నిర్మాత ఆరోపించాడు.

ఇదే డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ మ‌ధ్య వివాదానికి తెర‌లేపింది. దీంతో స‌ద‌రు డైరెక్ట‌ర్‌పై ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో నిర్మాత ఫిర్యాదు చేయ‌డం, స‌ద‌రు డైరెక్ట‌ర్ నుంచి రూ.200 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం కోర‌డం టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. డైరెక్ట‌ర్ మాత్రం నాకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వ‌కుండా ఇచ్చిన డ‌బ్బుని సీక్వెల్‌కు అడ్వాన్స్‌గా భావించ‌మంటున్నాడ‌ని స్ప‌ష్టం చేశాడు. ఇంత వ‌ర‌కు త‌న‌కు రావాల్సిన వాటా మొత్తాన్ని చెల్లించ‌లేద‌ని తేల్చి చెప్పాడు. ఈ వివాదం కార‌ణంగానే భారీ పాన్ ఇండియా సీక్వెల్ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది.

తాజాగా వివాదం రూ.2 కోట్ల‌తో స‌ద్దుమ‌న‌గ‌డంతో క్రేజీ సీక్వెల్ ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో క్రేజీ పాన్ ఇండియా సీక్వెల్ టైటిల్ రూ. 2 కోట్ల‌తో సెటిల్ అయిన‌ట్టుగా అంతా భావిస్తున్నారు. ఇప్పుడిదే టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రారంభానికి ముందే హాట్ టాపిక్‌గా మారిన ఈ పాన్ ఇండియా సీక్వెల్ లో క‌న్న‌డ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. నిర్మాణానికి ముందే భారీ ర‌చ్చ‌కు తెర‌లేపిన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ త‌రువాత ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో.

Tags:    

Similar News