జ‌న‌నాయ‌గ‌న్ డైల‌మా: స‌పోర్ట్ లేదంటూ ద‌ర్శ‌కుడు ఎమోష‌న‌ల్

ద‌ర్శ‌కుడు వినోద్ ఒక ర‌కంగా ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కున్నాడు. ఒకవైపు విజయ్ ఇమేజ్‌ను కాపాడాలి.. మరోవైపు సినిమాను సకాలంలో విడుదల చేయాలి.;

Update: 2026-02-18 12:06 GMT

దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం `జననాయగన్` చుట్టూ జరుగుతున్న పరిణామాలు దర్శకుడు హెచ్. వినోద్ ను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు తన సినిమా కోసం పడుతున్న ఆవేదన ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హెచ్. వినోద్ ఎందుకు ఎమోషనల్ అయ్యారు? అసలు ఏం జరుగుతోంది? అనే వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వినోద్ వ్యాఖ్య‌ల్లో నిరాశ నిస్పృహ‌లు కోలీవుడ్ లో హాట్ టాపిగ్గా మారాయి. ఇటీవల విడుదలైన `మై లార్డ్` వంటి సినిమాలకు వివాదాలు ఎదురైనప్పుడు జర్నలిస్టులు, మేధావులు మద్దతుగా నిలిచారు. కానీ తన సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు ఎవరూ అండగా ఉండటం లేదని ఆయన వాపోయారు. నేను రాజకీయాల గురించో లేదా సినిమా కష్టాల గురించి మాట్లాడితే నన్ను కాపాడటానికి ఎవరూ ముందుకు రారు! అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోంది?

`జననాయగన్` వాస్తవానికి 9 జనవరి 2026న సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ వివాదం కార‌ణంగా చాలా ఎదురు చూపులు త‌ప్ప‌లేదు. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించి రివైజింగ్ కమిటీకి పంపింది. సినిమాలో సైన్యం విష‌యంలో సున్నితమైన అంశాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

విజయ్ త్వరలో `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండటంతో ఆయన ప్రత్యర్థులు కావాలనే సినిమాను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కావాల‌నే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నార‌ని వినోద్ కూడా భావిస్తున్నారు. నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లినా కానీ.. కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

విజయ్ రాజకీయాల‌తోనే వినోద్ కి చిక్కులు:

ద‌ర్శ‌కుడు వినోద్ ఒక ర‌కంగా ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కున్నాడు. ఒకవైపు విజయ్ ఇమేజ్‌ను కాపాడాలి.. మరోవైపు సినిమాను సకాలంలో విడుదల చేయాలి. విజయ్ రాజకీయ ప్రత్యర్థులు సినిమాలోని డైలాగులను, సన్నివేశాలను వివాదాస్పదం చేస్తుండటంతో రిలీజ‌వుతుందా లేదా? అనే డైల‌మాతో దర్శకుడిగా వినోద్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది విజయ్ ఆఖరి సినిమా కావడంతో వినోద్ దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ద‌ళ‌ప‌తి చివ‌రి సినిమాని బంప‌ర్ హిట్ చేయాల‌ని వినోద్ ఎంత‌గానో త‌పించాడు. రేయింబ‌వ‌ళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం శ్ర‌మించాడు. రాజీ లేని బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేసారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అత‌డి శ్రమను వృధా చేసేలా ఉన్నాయని ఆయన భయపడుతున్నారు.

ఇది తెలుగు సినిమా రీమేక్?

జ‌న‌నాయ‌గ‌న్ చిత్రం ఎన్బీకే న‌టించ‌న `భగవంత్ కేసరి`కి రీమేక్ అంటూ ప్ర‌చారం ఉంది. అయితే ఈ వార్తలను వినోద్ ఖండించారు. ఇది వంద‌శాతం స్ట్రెయిట్ విజయ్ సినిమా అని స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 2026లో కూడా విడుదల కావడం కష్టమేనని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే వినోద్ క‌ష్టం ఇప్ప‌ట్లో తీర‌న‌ట్టే. ఒక ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడికి ఈ అడ్డంకి నిజంగా శాపం లాంటిది. ఈ సినిమా విడుద‌లై విజ‌యం సాధిస్తే అతడి కెరీర్ కి అది ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంది.

Tags:    

Similar News