విష్ణు విన్యాసం.. శ్రీ విష్ణు ఖాతాలో మ‌రో హిట్ ప‌డేట్టుందే!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు, త‌న కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు.;

Update: 2026-02-18 13:02 GMT

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు, త‌న కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. కింగ్ ఆఫ్ ఎంట‌ర్టైన్మెంట్ గా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు త్వ‌ర‌లో మరో ఎంట‌ర్టైనింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అత‌ని తాజా సినిమా విష్ణు విన్యాసం టీజర్ ను మేక‌ర్స్ రీసెంట్గా రిలీజ్ చేయ‌గా, ఆ టీజ‌ర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎంట‌ర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు య‌దునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్నారు.



 


రీసెంట్ టైమ్స్ లో వరుస స‌క్సెస్‌ల‌తో మంచి ఫామ్‌లో ఉన్న శ్రీ విష్ణు, ఈ సినిమాతో మరోసారి తనదైన ఎంటర్టైన్‌మెంట్ స్టైల్‌ను చూపించనున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. జాతకాలు, వాస్తు వంటి వాటిపై అతిగా ఆసక్తి చూపే యువకుడిగా శ్రీ విష్ణు ఈ మూవీలో క‌నిపించ‌నున్నారు. డబ్బే లోకంగా భావించే తండ్రికి, జాత‌కాలని న‌మ్మే కొడుకుకి మ‌ధ్య జరిగే సంఘర్షణ కథకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌నుంద‌ని, ఈ కాన్సెప్ట్‌లోనే కామెడీని మేళవించిన తీరు ఆడియ‌న్స్ ను అలరిస్తుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.

ఈ సినిమాలో నయన సారిక హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, మూవీలో ఆమె క్యారెక్ట‌ర్ కూడా కథలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఓ వైపు ప్రేమతో మమేకమవుతూ, మరోవైపు హీరోకు పెళ్లి సంబంధాలు చూడమని చెప్పే విధంగా ఆమె పాత్రకు ఊహించ‌ని మలుపుల‌ను చూపించారు. ఈ విభిన్నమైన రొమాంటిక్ ట్రాక్‌కు డైరెక్ట‌ర్ యదునాథ్ మారుతి రావు స్పెష‌ల్ కేర్ తీసుకున్న‌ట్టు టీజ‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

అంచనాలను పెంచేసిన టీజ‌ర్

ప్ర‌మోషన‌ల్ కంటెంట్ తో ఇప్ప‌టికే సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచిన చిత్ర యూనిట్ ఇప్పుడు టీజ‌ర్ తో ఆ అంచ‌నాల‌ను ఇంకా పెంచి, సినిమాకు మంచి బ‌జ్ వ‌చ్చేలా చేశారు. శ్రీవిష్ణు త‌న కామెడీ టైమింగ్ తో మ‌రోసారి ఆడియ‌న్స్ ను క‌డుపుబ్బా న‌వ్వించ‌డానికి రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సుమంత్ నాయుడు.జి మంచి ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ తో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించిన‌ట్టు టీజ‌ర్ చూస్తుంటేనే తెలుస్తోంది.

ఈ మూవీకి రాధ‌న్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, టీజ‌ర్ కోసం అత‌ను అందించిన బీజీఎం స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. మ్యూజిక్ కు తగ్గ విజువ‌ల్స్ కూడా ప‌డ‌టంతో టీజ‌ర్ చూడ‌గానే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క‌లుగుతున్నాయి. మొత్తానికి ఫిబ్ర‌వరి 28న రిలీజ్ కానున్న విష్ణు విన్యాసం సినిమాతో శ్రీవిష్ణు మ‌రో హిట్ ను అందుకోబోతున్నార‌ని అనిపిస్తుంది. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News