మ‌హేష్-సందీప్‌ వంగ ప్రాజెక్ట్ సాధ్య‌మేనా?

ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత సందీప్‌రెడ్డి వంగ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో క్రేజీ మూవీకి శ్రీ‌కారంచుట్ట‌బోతున్నాడ‌ని వార్తలు షికారు చేస్తున్నాయి.;

Update: 2026-02-18 13:17 GMT

తెలుగులో అర్జున్‌రెడ్డి, హిందీతో యానిమ‌ల్ వంటి సంచ‌ల‌న చిత్రాల‌ని అందించి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు సందీప్‌రెడ్డి వంగ‌. ఇండియాలోని టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న సందీప్‌రెడ్డి వంగ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రూపొందిస్తున్న‌ భారీ యాక్ష‌న్ డ్రామా `స్పిరిట్‌`. డైలాగ్ వీడియోతోనే సినిమాపై అంచ‌నాల్ని పెంచేసిన సందీప్ ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్‌ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ న‌టిస్తుండ‌టం, రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ నెట్టింట కేక‌పుట్టించ‌డంతో ఈ ప్రాజెక్ట్‌ని సందీప్ రెడ్డి వంగ మామూలుగా తీయ‌డం లేద‌ని, ఓ రేంజ్‌లో తెర‌పైకి తీసుకొస్తున్నాడ‌నే చ‌ర్చ మొద‌లైంది. అందుకు త‌గ్గ‌ట్టే కీల‌క క్యారెక్ట‌ర్ల‌లో త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా, ప్ర‌ధాన పాత్ర‌ల్లో వివేక్ ఓబెరాయ్‌, కాంచ‌న‌, ప్ర‌కాష్ రాజ్ లాంటి వారిని తీసుకోవ‌డంతో స‌హ‌జంగానే `స్పిరిట్‌` మూవీపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత సందీప్‌రెడ్డి వంగ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో క్రేజీ మూవీకి శ్రీ‌కారంచుట్ట‌బోతున్నాడ‌ని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌ని ఏషియ‌న్ సినిమాస్‌ సునీల్ నారంగ్ నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇది ఇప్ప‌ట్లో సాధ్యం అయ్యేనా? అని కొంత మంది చ‌ర్చించుకుంటున్నారు. సందీప్‌రెడ్డి వంగ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స్పిరిట్‌` మూవీని రూపొందిస్తున్నాడు. ఇది పూర్త‌యిన త‌రువాత ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో `యానిమ‌ల్ పార్క్‌`ని పూర్తి చేయాలి.

ఆ త‌రువాత అల్లు అర్జున్ హీరోగా టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఓ భారీ మూవీని చేయాలి. ఇప్ప‌టికే దీనికి సందీప్ రెడ్డి వంగ క‌మిట్ అయి ఉన్నాడు. ఇవ‌న్నీ పూర్తి కావాలంటే మ‌రో రెండు మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. మ‌హేష్ కూడా ఇప్పుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న `వార‌ణాసి`లో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లో ఈ మూవీ షూటింగ్ పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీని ప్ర‌మోష‌న్స్ పూర్త‌యి సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు మ‌హేష్ డేట్స్ ల‌భించ‌ని ప‌రిస్థితి.

అయితే సందీప్‌తో చేయాల‌నుకున్న ర‌ణ్‌బీర్ క‌పూర్ రామాయ‌ణ పార్ట్ 1, పార్ట్ 2ల‌తో బిజీగా ఉన్నాడు. ఆ త‌రువాత సంజ్ లీలా భ‌న్సాలీ `ల‌వ్ అండ్ వార్‌` ఉంది కాబ‌ట్టి త‌ను ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే అవ‌కాశం లేదు. ఇక అల్లు అర్జున్ ప్ర‌స్తుతం అట్లీ డైరెక్ష‌న్‌లో పాన్ వ‌ర‌ల్డ్ మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాకుండానే లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి దాన్ని కూడా మొద‌లు పెట్టేస్తున్నాడు. దీని త‌రువాత త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మూవీ ఉంది. ఇవ‌న్నీ పూర్త‌యితే కానీ సందీప్‌కు డేట్స్ ఇవ్వ‌డు. ఇలా సందీప్‌తో చేయాల్సిన అల్లు అర్జున్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు. కాబ‌ట్టి సందీప్‌కు ఉన్న ఏకైక ఆప్ష‌న్ మ‌హేష్‌. అందుకే `స్పిరిట్‌` త‌రువాత‌ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే మ‌హేష్ ఫ్యాన్స్‌కి పండ‌గే అని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News