ఆఫ‌ర్ కోసం 'ధురంధ‌ర్‌' డైరెక్ట‌ర్ వెంట‌ప‌డిందా?

రొమాంటిక్ మూవీ రిలీజ్ నేప‌థ్యంలో ఓ మీడియాతో మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ డైరెక్ట‌ర్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.;

Update: 2026-02-18 11:30 GMT

 దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మూవీ `ధురంధ‌ర్‌`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ రూపొందించిన ఈ స్పై యాక్ష‌న్ డ్రామా రా అండ్ ర‌స్టిక్ అంశాల నేప‌థ్యంలో రూపొంది ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని, విమ‌ర్శ‌కుల్ని విస్మ‌యానికి గురి చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 5న సైలెంట్‌గా విడుద‌లై కేవ‌లం మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ర్యాంపేజ్ చేసి ట్రేడ్ వ‌ర్గాల‌ని షాక్‌కు గురి చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా రానున్న `ధురంధ‌ర్ 2 ది రివేంజ్‌`పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

మార్చి 19న న‌`ధురంధ‌ర్ 2 ది రివేంజ్‌` రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్యాచ్ వ‌ర్క్ ముంబైలోని ఛారిత్ర‌క క‌ట్ట‌డాల మ‌ధ్య జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్‌తో పాటు మ‌రికొంత మంది డైరెక్ట‌ర్ల‌పై క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ మృణాల్ ఠాకూర్ స్టార్ డైరెక్ట‌ర్స్‌పై క్రేజీ కామెంట్స్ చేసింది. `సూప‌ర్ 30` మూవీతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ఈ మ‌రాఠీ సోయ‌గం ఇప్పుడు తెలుగు, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తోంది.

`సీతారామం` వంటి క్లాసిక్ బ్లాక్ బస్ట‌ర్‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో క‌లిసి `డెకాయిట్‌`, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూప‌ర్ హీరో మూవీతో పాటు హిందీలో దో దివానే షెహ‌ర్ మే, హై జ‌వానీతో ఇష్క్ హోనాహీ హై, పూజా మెరీ జాన్ వంటి సినిమాల్లో న‌టిస్తోంది. ఇందులో మృణాల్ న‌టించిన `దో దివానే షెహ‌ర్ మే` ఫిబ్ర‌వ‌రి 20న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. సిద్దాంద్ చ‌తుర్వేది హీరో. ర‌వి ఉద్య‌వార్ డైరెక్ట‌ర్‌. సంజ‌య్ లీలా భ‌న్సాలీతో క‌లిసి ప్రేమ‌సింగ్‌, ఉమేష్ కుమార్ భ‌న్సాలీ, భ‌ర‌త్ కుమార్ రంగ నిర్మించారు.

రొమాంటిక్ మూవీ రిలీజ్ నేప‌థ్యంలో ఓ మీడియాతో మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ డైరెక్ట‌ర్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మ‌నం డైరెక్ట‌ర్ల‌ని వెంటాడాలి. మ‌నం ఉన్నామ‌ని వారికి గురంతిండిపోయేలా చేయాలి. నేను ఇలాగే చాలా మంది డైరెక్ట‌ర్ల‌ని వెంటాడాను. అందులో ఈ సినిమా డైరెక్ట‌ర్ ర‌వి ఉద్యవార్ కూడా ఉన్నాడు. అలా వెంట‌ప‌డ‌టం వ‌ల్లే నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు. ఇదే త‌ర‌హాలో `ధురంధ‌ర్` డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్‌ని కూడా వెంట‌ప‌డి నాకు ఒక్క అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగాని, అయితే అది ఇప్ప‌టికీ జ‌ర‌గ‌లేదు` అని చెప్పుకొచ్చింది.

అయితే తాను అతిగా వెంట‌ప‌డిన తొలి డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ అని, ఆయ‌న‌ని ఎంత‌గా అడిగినా ఇప్ప‌టికీ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని వాపోయింది. మ‌రి ఈ మాట‌లు విని అయినా ఆదిత్య ధ‌ర్ త‌న నెక్స్ట్ మూవీలో మృణాల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇస్తాడా? అని బాలీవుడ్ వ‌ర్గాలు, మృణాల్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అడివి శేష్‌తో క‌లిసి మృణాల్ ఠాకూర్ న‌టించిన `డెకాయిట్‌` మార్చి 19న రిలీజ్ కావాల్సింది. అయితే అదే రోజు `ధురంధ‌ర్ 2 ది రివేంజ్‌` రిలీజ్ అవుతుండ‌టంతో `డెకాయిట్‌`ని వాయిదా వేశారు.

Tags:    

Similar News