ఫోటో స్టొరీ: కాకరేపుతున్న కన్నడ సుందరి

Update: 2018-10-30 07:43 GMT
టాలీవుడ్ లో హీరోయిన్ గా రీసెంట్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నభా నటేష్.  మొదటి సినిమా 'నన్ను దోచుకుందువటే' తోనే అందరినీ మెప్పించిన నభాకు జస్ట్ అందమే కాదు యాక్టింగ్ టాలెంట్ కూడా ఫుల్ గా ఉంది.  బెంగళూరులో థియేటర్ యాక్టింగ్ చేసిన అనుభవంతోనే అది సాధ్యమైంది. ఇక మోడలింగ్ రంగంలో కూడా అనుభవం ఉంది.

ఈ జెనరేషన్ బ్యూటీల మాదిరిగానే నభా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఒక పాత ఫోటోగ్రాఫ్ ను పోస్ట్ చేసింది. పాత అంటే మరీ మీరు క్రీస్తు పూర్వం నాటిదనుకునేరు.. కాదు బాబోయ్.. ఈ ఏడాది సైమా వేడుకలు జరిగినప్పటిది.  ఈ ఫోటోలో రెడ్ కార్పెట్ మీద నడిచేందుకు స్పెషల్ గా డిజైన్ చేసిన గౌన్ లో ఉంది.  సవితా రెడ్డి ఆ గౌన్ ను డిజైన్ చెయ్యగా మానవితా హరీష్ ఈ ఫోటో ను తీసినట్టుగా నభా చెప్పుకొచ్చింది.

గ్రే కలర్ గ్రానైట్ స్టోన్ డిజైన్ అనిపించే షోల్డర్స్ లేని  గౌన్లో స్టైల్ గా నడుముపై చేయి ఆన్చి నిలబడింది.  లూజ్ హెయిర్ తో ఒక ప్రొఫెషనల్ మాడల్ లాగా పోజిచ్చింది.  అందరూ బ్యూటీ లు చేసినట్టే క్లీవేజ్ షో చేసినా అదేమీ ఆడ్ గా అనిపించడం లేదు. తన అందంతో యాటిట్యూడ్ తో నెటిజనుల హృదయాలను దోచుకుంటోంది. ఇక ఆమె ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే  మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా.. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News