ఎదురుగా మహేష్.. టేకుల మీద టేకులు

Update: 2017-09-26 01:30 GMT
అసలే ద్విభాషా చిత్రం.. ప్రతి సన్నివేశం రెండుసార్లు చేయాలి.. నెలల తరబడి షూటింగ్.. అందులో 80 రోజుల పాటు రాత్రి పూటే చిత్రీకరణ.. ఇలాంటి స్థితిలో సినిమా అంతటా కనిపించాల్సిన హీరో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఇలాంటి స్థితిలో ఒకే సన్నివేశానికి ఎక్కువ టేక్స్ చేయాలంటే మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఐతే ‘స్పైడర్’ చిత్రీకరణలో మహేష్ బాబు ఎక్కడా కూడా అసహనానికి గురి కాకుండా.. ఓపిగ్గా వ్యవహరించాడని చెప్పాడు మురుగదాస్. వేరే ఆర్టిస్టుల వల్ల ఇబ్బందులు ఎదురైనా కూడా అతను ఫ్రస్టేట్ కాలేదన్నాడు మురుగ.

‘‘ఒక రోజు ఐజీ ఆఫీసులో మహేష్.. మరో ఆర్టిస్టుతో తీయాల్సిన సన్నివేశం మొదలుపెట్టాం. అది చాలా ఈజీగా అయిపోతుందనుకున్నా. కానీ ఆ చిన్న సన్నివేశం పూర్తి చేయడానికి సగం రోజుకు పైగా పట్టేసింది. మహేష్ సరిగ్గా చేసినా.. అవతలి ఆర్టిస్టు డైలాగ్ చెప్పడంలో ఇబ్బంది పడి చాలా టేక్స్ తీసుకున్నాడు. అయినప్పటికీ మహేష్ చాలా ఓపిగ్గా ఉన్నాడు. ఆ ఆర్టిస్టే కాదు.. వేరే వాళ్లు కూడా టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారు. అలాగే తెలుగులో ఈజీగా ఓకే అయిన సీన్.. తమిళంలో ఐదారు టేక్స్ తీయాల్సి వచ్చేది. తమిళంలో ఓకే అయిన సన్నివేశంతో తెలుగులో ఆలస్యమయ్యేది. కానీ ఏ సందర్భంలోనూ మహేష్ అసహనానికి గురి కాలేదు. తోటి ఆర్టిస్టుల మీద కోప్పడితే.. వాళ్లు భయపడిపోతారని భావించి సంయమనం పాటించాడు. ‘స్పైడర్’ లాంటి సవాలుతో కూడిన సినిమాను నేను ఏ ఇబ్బందీ లేకుండా పూర్తి చేయగలిగానంటే అందుకు మహేష్ ఇచ్చిన బలమే కారణం’’ అని మురుగదాస్ తెలిపాడు.
Tags:    

Similar News