పాజిటివ్ సమీక్షలతో MI7 .. టామ్ క్రూజ్ సంబరాలు
గాల్లోనే శత్రువు లతో పోరాటాలు.. విమానం పై నుంచి విమానం పైకి జంప్ లు.. కొండ శిఖరం పై నుంచి బైక్ జంప్ లు.. భయానక కార్ ఛేజ్ లు.. పారాచూట్ తో అద్భుత సాహసవిన్యాసాలు.. గగుర్పొడిచే ట్రైన్ ఎపిసోడ్.. ఒకటేమిటి అరివీర సాహస విన్యాసాలతో రక్తి కట్టించడంలో టామ్ క్రూజ్ తర్వాతే. అతడు నటించే ప్రతి సినిమా దేనికదే యాక్షన్ అడ్వెంచర్ కేటగి రీలో క్లాసిక్స్ గా నిలుస్తున్నాయి. టాప్ గన్ మూవరిక్ తర్వాత అతడు నటించిన ఎంఐ 7 విడుదల కు సిద్ధమవుతోంది.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ అంటేనే గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాల తో భయానక పోరాటా లతో సాగే గూఢచారి సిరీస్ గా ప్రజల అభిమానం చూరగొంది. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ లో తొలి ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
టామ్ క్రూజ్ 60 ఏళ్ల వయసు లో గగుర్పొడిచే సాహసాలతో షాక్ లిస్తున్న తీరు నిరంతరం చర్చనీయాంశంగా మారుతోంది. మిషన్: ఇంపాజిబుల్ సిరీస్ ఏడవ భాగం జూలై 12న విడుదల కానున్న సందర్భంగా సరిగ్గా 20 రోజుల ముందే భారతదేశం లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
మోస్ట్ అవైటెడ్ 'మిషన్: ఇంపాజిబుల్ 7'(డెడ్ రెకనింగ్) స్టార్-స్టడెడ్ వరల్డ్ ప్రీమియర్ రోమ్ లో వీక్షించిన వారంతా సమీక్షల్లో చాలా అద్భుతం అంటూ కొనియాడారు. ఊహించిన విధంగానే ప్రీమియర్ ల నుండి సానుకూల స్పందన లభించింది.
టామ్ ఉత్కంఠభరిత మైన విన్యాసాల కు థమ్స్ అప్ చూపిస్తున్నారంతా. టామ్ కొండ అంచు నుండి మోటార్ సైకిల్ జంప్ చేయించడం.. డెడ్ రెకనింగ్ కార్ చేజ్ సన్నివేశం .. లోయల్లోకి పారాచూట్లతో జంప్ లు.. అలాగే ట్రైన్ ఎపిసోడ్.. వగైరా వగైరా విన్యాసాలు ఆద్యంతం రక్తి కట్టిస్తాయి.ఈ వేసవి సీజన్ కి సమయానుకూలమైన కథ.
ఈ చిత్రం అద్భుతమైన కొత్త పాత్రలను పరిచయం చేస్తుంది. ఫ్రాంచైజ్ చరిత్ర లో మొదటి రెండు లేదా మూడు స్థానాల్లో ఉండే చివరి సెట్ సినిమా విస్తృతంగా చర్చల్లోకొస్తుంది. అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది అంటూ ప్రశంసలు కురిసాయి. ఈ వేసవి ముగింపు టామ్ క్రూజ్ సినిమా తో ఘనంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇప్పటికే థియేటర్లలో ది ఫ్లాష్ - ట్రాన్స్ ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ చిత్రాలు చక్కని రేటింగు లతో చెప్పుకోదగ్గ వసూళ్లను సాధిస్తున్నాయి.