రుక్మిణిలో అన్నీ వెరియేషన్స్..!
సౌత్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న భామ రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస స్టార్ ఛాన్స్ లను అందుకుంటుంది.;
సౌత్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న భామ రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస స్టార్ ఛాన్స్ లను అందుకుంటుంది. కాంతారా చాప్టర్ 1 లో తన రోల్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది ఈ అమ్మడు. కాంతారా 1 తో రుక్మిణి వసంత్ సత్తా చాటగా ఆమె క్రేజ్ మరింత పాపులర్ అయ్యింది. అందుకే అమ్మడికి వరుస ఛాన్స్ లు ఇస్తున్నారు. ఐతే రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్ టీ ఆర్ డ్రాగన్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఆ సినిమాతో అమ్మడు ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.
టాక్సిక్ సినిమాలో ఎప్పుడూ లేని విధంగా..
రుక్మిణి వసంత్ యష్ తో టాక్సిక్ సినిమా ఛాన్స్ అందుకుంది. డ్రాగన్ లో తన లుక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ యష్ టాక్సిక్ సినిమాలో రుక్మిణి వసంత్ గ్లామర్ రోల్ లో కనిపిస్తుంది. రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటిలో ప్రేమికురాలిగా.. కాంతారా చాప్టర్ 1లో ఒక డిఫరెంట్ రోల్ చేయగా టాక్సిక్ సినిమాలో ఆమె ఇదివరకు ఎప్పుడు లేని విధంగా గ్లామర్ రోల్ తో మెస్మరైజ్ చేయనుంది.
రుక్మిణి వసంత్ లో ఈ వేరియేషన్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. రుక్మిణి ఇప్పటికే సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకోగా రాబోతున్న ఈ సినిమాలతో మళ్లీ అదరగొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రుక్మిణి వసంత్ ఒక ప్లానింగ్ ప్రకారంగానే కెరీర్ కొనసాగిస్తుందని చెప్పొచ్చు. తప్పకుండా అమ్మడు సౌత్ లో టాప్ ప్లేస్ కైవసం చేసుకునేలా ఉంది.
మొన్నటిదాకా నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్ లో రుక్మిణి వసంత్ పేరు మారు మోగిపోతుంది. తెలుగులో ఇప్పటికే స్టార్ ఛాన్స్ లతో దూసుకెళ్తున్న అమ్మడు నెక్స్ట్ రాబోయే సినిమాలతో కూడా తన సత్తా చాటేలా ఉంది. ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ అదరగొట్టేస్తున్న అమ్మడు రాబోయే ఐదారేళ్ల కెరీర్ లో టాప్ రేంజ్ కొనసాగించేలా ఉంది.
సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న హీరోయిన్..
రుక్మిణితో పాటు మిగతా భామలంతా కూడా ప్రయత్నిస్తున్నా ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న హీరోయిన్ గా రుక్మిణి అదరగొట్టేస్తుంది.
తారక్ సినిమానే కాదు నెక్స్ట్ చరణ్ తో కూడా అమ్మడు జత కట్టే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. సో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే రుక్మిణి వసంత్ యాక్టింగ్ తోనే కాదు గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అయ్యి ఇంప్రెస్ చేసేలా ఉంది. మరి రుక్మిణి ఈ వేరియేషన్స్ ఎంతమేరకు అమ్మడికి ప్లస్ అవుతాయన్నది చూడాలి.