కొత్త సన్నివేశాలతో రాజాసాబ్ సరికొత్తగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన `ది రాజాసాబ్` ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన `ది రాజాసాబ్` ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కో వాల్సి వచ్చింది. సినిమాకు నెగిటివ్ రివ్యూలు..థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ తో దుమ్మెత్తి పోసారు. సినిమాపై మారుతి ఎంతో కాన్పిడెంట్ గా ఉంటే? అందుకు భిన్నంగా సన్నివేశం థియేటర్ వద్ద, రివ్యూల రూపంలో కనిపించింది. దీనికి సంబంధించి మారుతి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ వచ్చే ప్రయత్నం చేసారు.
అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించినట్లు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటిలో కొన్నింటిని అదనంగా కలుపుతున్నట్లు తెలిపారు. ద్వితియార్దాన్ని కాస్త ట్రిమ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే తొలగించిన ప్రభాస్ సన్నివేశాలు యాడ్ చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి న్యూ వెర్షన్ అందుబాటులో ఉం టుంది. ప్రత్యేకించి ప్రభాస్ ఓల్డ్ గెటప్ కు సంబంధించిన సన్నివేశాలు యాడ్ చేసారు. మరి న్యూ వెర్షన్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. ఇప్పటికే సినిమా రిలీజ్ అయి రెండు రోజులవుతోంది.
ఎంత రాబట్టినా? మరో కొత్త సినిమా పోటీగా రానంత వరకే. మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `మనశంకర వరప్రసాద్ గారు` రిలీజ్ అవుతుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. అనంతరం ఆ మరుసటి రోజు మాస్ రాజా రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` రిలీజ్ అవుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపైనే అంచనాలు బాగానే ఉన్నాయి.
అటుపై యువ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నటించిన `నారీ నారీ నడుమ మురారీ` రిలీజ్ అవుతున్నాయి. తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన `వా వాతయార్` తెలుగులో `అన్నగారు వస్తారు` టైటిల్ తో రిలీజ్ అవుతుంది. జనవరి 14న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఇలా ఇన్ని సినిమాల మద్యలో `రాజాసా బ్` పోటీ పడాల్సి ఉంటుంది. మరి వచ్చిన నెగిటివ్ టాక్ నేపథ్యంలో న్యూ వెర్షన్ ప్రేక్షకుల్ని ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.