విరోష్ జంట: ఫస్ట్ లవ్ ఎవరు ప్రపోజ్ చేశారంటే?
వెండితెర మీద 'గీత గోవిందం'గా అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక నిజ జీవితంలోనూ ఒక్కటవ్వాలని కోరుకోని అభిమాని ఉండడు.;
వెండితెర మీద 'గీత గోవిందం'గా అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక నిజ జీవితంలోనూ ఒక్కటవ్వాలని కోరుకోని అభిమాని ఉండడు. ఫిబ్రవరి 26న అట్టహాసంగా పెళ్లి చేసుకున్న ఈ 'విరోష్' జంట, తాజాగా తమ ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో కొన్ని సీక్రెట్స్ పంచుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరిలో అసలు మొదటి అడుగు ఎవరు వేశారు? మనసులోని ప్రేమను ఫస్ట్ ఎవరు బయటపెట్టారు? అన్న ప్రశ్న నెటిజన్లను ఎప్పటి నుంచో వేధిస్తోంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ, విజయ్ దేవరకొండ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆ క్యూట్ లవ్ స్టోరీ విశేషాలు మనము తెలుసుకుందాం..
అభిమానులకు విందు - దగ్గరుండి వడ్డించిన విరోష్:
పెళ్లి తర్వాత తనను గుండెల్లో పెట్టుకునే అభిమానుల కోసం విజయ్, రష్మిక ఒక అద్భుతమైన గ్రీట్ & మీట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సరదాగా సమయాన్ని గడిపారు. ఇక కేవలం మాట్లాడటమే కాదు, స్వయంగా దగ్గరుండి అభిమానులకు రకరకాల వంటకాలు, స్వీట్లు వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ, ఫ్యాన్స్‌తో కలిసి భోజనం చేయడం ఆక్కడ పండగ వాతావరణం నెలకొంది.
ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? విజయ్ సమాధానం:
ఈ సందడిలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు విజయ్ చాలా ఓపెన్‌గా సమాధానాలు ఇచ్చారు. అందరినీ ఊరిస్తున్న ఆ ప్రశ్న - "మీలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు?" దీనికి విజయ్ స్పందిస్తూ, రష్మికనే తనకు ముందుగా లవ్ ప్రపోజ్ చేసిందని నవ్వుతూ చెప్పారు. ఇక గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలు చేసిన తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఆ క్రమంలోనే రష్మిక తన మనసులో మాటను బయటపెట్టిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
ప్రేమ నుంచి పెళ్లి దాకా - విరోష్ ప్రయాణం:
చాలా కాలం పాటు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట, చివరకు పెద్దల అంగీకారంతో అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల్లో వీరి కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో, నిజ జీవితంలో కూడా అంతకంటే అద్భుతంగా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. తాజాగా ఫ్యాన్స్‌తో జరిగిన ఈ ముచ్చట్లు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా అభిమానుల పట్ల వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి "మీరు నిజంగా గ్రేట్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.