రవితేజపై ట్రోల్స్.. ఇచ్చిపడేసిన బాబీ!

ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.;

Update: 2026-01-11 06:17 GMT

చివరిగా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే డింపుల్ హయతి , ఆషికా రంగనాథ్ హీరోయిన్ లుగా రవితేజ హీరోగా చేస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ , సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న డైరెక్టర్ బాబీ ఇప్పటివరకు రవితేజ పై వచ్చిన ట్రోల్స్ కి తనదైన శైలిలో స్పందించి ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు బాబీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు బాబి మాట్లాడుతూ.." రవితేజ రొటీన్ సినిమాలు చేస్తారని కొంతమంది హేటర్లు కామెంట్ చేయడం చూశాను. కానీ కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా చేసింది మాస్ మహారాజా మాత్రమే. ముఖ్యంగా నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో లాంటి చిత్రాలు ప్రేక్షకులు హిట్ చేశారు. అందులో ఆయన అద్భుతమైన నటన ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రవితేజ అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే కమర్షియల్ హీరోలకి ఎప్పటికీ చెరిపేయలేని కొన్ని పరిమితులు ఉంటాయి. చిరంజీవి లాంటి మెగాస్టారే రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి గొప్ప క్లాసికల్ సినిమాలు చేస్తే ప్రజలు వాటిని తిప్పి కొట్టారు. ఇక శ్రీమంతుడు తరహాలో కే విశ్వనాథ్ బాలకృష్ణతో జననీ జన్మభూమి అనే సినిమా చేశారనే విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఫలానా సినిమా హిట్ చేయకపోవడం అనేది ముమ్మాటికి ఆడియన్స్ తప్పు కాదు. తాము కోరుకున్నవి ఇవ్వలేనప్పుడు మొహమాటం లేకుండా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. రవితేజ కూడా అంతే.. ధమాకా కి అంత పెద్ద విజయం అందించిన విషయం మనం మర్చిపోతే ఎలా? కాబట్టి ఏదైనా సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ బ్యాటింగ్ కూడా మామూలుగా ఉండదు. ఈసారి భర్త మహాశయులకు విజ్ఞప్తితో అది ఖచ్చితంగా నెరవేరుతుందని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు అంటూ బాబి చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే రవితేజ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతోనే ఇలాంటి ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు సపోర్టుగా ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు బాబి.

ఇక బాబీ విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నారు. గతంలో బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేసి విజయాన్ని అందుకున్న బాబీ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. అటు చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలైన వెంటనే ఆయన బాబి మూవీ షూటింగ్లో పాల్గొంటారు.

Tags:    

Similar News