ఏంజల్ నిధి.. ఇప్పుడు ఏంటి పరిస్థితి..?

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి లాస్ట్ ఇయర్ హరి హర వీరమల్లు చేసింది. ఆ సినిమా దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉండి ఫైనల్ గా లాస్ట్ ఇయర్ రిలీజైంది.;

Update: 2026-01-11 06:19 GMT

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి లాస్ట్ ఇయర్ హరి హర వీరమల్లు చేసింది. ఆ సినిమా దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉండి ఫైనల్ గా లాస్ట్ ఇయర్ రిలీజైంది. ఐతే సినిమాపై అంచనాలు ఉండటం దానికి తోడు క్రిష్ మధ్యలో వదిలేసిన ఆ ప్రాజెక్ట్ జయకృష్ణ పూర్తి చేయడం లాంటివి వీరమల్లు సినిమాను గాడి తప్పేలా చేశాయి. ఐతే ఆ సినిమా మీద హోప్స్ పెట్టుకున్న నిధి అగర్వాల్ కి షాక్ తగిలినట్టు అయ్యింది. వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ప్రమోషన్స్ లో పాల్గొన్నది నిధి.

ప్రభాస్ పక్కన నిధి జోడీ..

ఐతే వీరమల్లు రిజల్ట్ ఎలా ఉన్నా అమ్మడి చేతిలో రాజా సాబ్ ఉంది కదా అని అనుకున్నారు. రాజా సాబ్ లో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కాస్త స్క్రీన్ ప్రెజెన్స్ లో ఆకట్టుకుంది అంటే నిధి మాత్రమే. ప్రభాస్ పక్కన నిధి జోడీ ఆకట్టుకుంది. ఐతే రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి చేసిన రాజా సాబ్ మీద నిధి చాలా హోప్స్ పెట్టుకుంది. సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాలని అనుకుంది.

కానీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి అమ్మడికి నిరాశ తప్పట్లేదు. రాజా సాబ్ మీద నిధి అగర్వాల్ చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రభాస్ సినిమా అంటే నేషనల్ వైడ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాంటి సినిమాలో నిధి నటించడం ఆమె రేంజ్ పెంచేలా చేస్తుందని అనుకున్నారు. కానీ అది అమ్మడికి ఆశించిన కిక్ ఇచ్చినట్టు అనిపించట్లేదు. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఎందుకో అంత గొప్ప ఛాన్స్ లు తెచ్చుకోలేదు.

బలమైన పాత్రలు చేస్తేనే..

ఐతే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్, ఈ ఇయర్ ప్రభాస్ తో కలిసి నటించినా కూడా అమ్మడికి కలిసి రాలేదు. ఐతే రాజా సాబ్ సినిమా తర్వాత మరో 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు చేస్తున్నా అని ఇంటర్వ్యూస్ లో చెప్పిన ఈ అమ్మడు ఈ రిజల్ట్ తర్వాత కూడా ఆ అవకాశాలు చేజిక్కించుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఒకప్పటిలా సినిమాలో కేవలం గ్లామర్ గా కనిపిస్తే కెరీర్ బాగుంటుంది అన్నది లేదు. కచ్చితంగా బలమైన పాత్రలు చేస్తేనే కొన్నాళ్లు కెరీర్ బాగుంటుంది. ఐతే గ్లామర్ గా కనిపించినా అది కథలో చాలా కీలకం అనిపించాలి కానీ ఏదో పెట్టాలి కాబట్టి లెక్కలు పెడితే మాత్రం వర్క్ అవుట్ అవ్వదు. మరి రాజా సాబ్ తర్వాత నిధి ఆఫర్లపై బజ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

నిధి అగర్వాల్ తెలుగులోనే వరుస సినిమాలు చేయాలన్న ఆలోచన ఉన్నా స్టార్ ఛాన్స్ లు చేతిలో ఉన్నా కూడా అమ్మడికి లక్ మాత్రం కలిసి వచ్చేలా లేదు. పవన్, ప్రభాస్ సినిమాలు పడినా కెరీర్ లో జోష్ కనిపించట్లేదు. తమిళ్ లో అమ్మడికి గుడి కట్టే రేంజ్ ఫ్యాన్స్ ఏర్పరచుకోగా అక్కడ కూడా అమ్మడు ఈమధ్య అవకాశాలు రావట్లేదు.

Tags:    

Similar News